ఉయ్యాల వాడ నరసింహారెడ్డి చిరు మార్పు

Published : May 18, 2017, 10:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ఉయ్యాల వాడ నరసింహారెడ్డి చిరు మార్పు

సారాంశం

త్వరలో పట్టాలెక్కనున్న చిరంజీవి 151వ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మూవీ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ మారుతుందట 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఇప్పటిదాకా అనుకుంటున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ కేవలం వర్కింగ్ టైటిలే అని.. అసలు పేరు మొత్తం పూర్తయిన తర్వాత పెడతారని తెలుస్తోంది.

 

మరోవైపు ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నట్టుగా అధికారికగా ప్రకటించింది మెగా టీమ్. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది.

 

ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా ఫిక్స్ అయిందని అంతా భావించారు. అయితే ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటోంది చిత్రయూనిట్. బాహుబలి 2 రిలీజ్ తరువాత మెగా 151ని కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు పక్కా స్కెచ్ గీస్తున్నారు. బాలీవుడ్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు అక్కడి నిర్మాతలతో చర్చలు ప్రారంభించారని, అందుకే బడ్జెట్ కూడా మరింత పెంచారని ప్రచారం జరుగుతోంది.



ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్న ఈ సినిమాకు అన్ని భాషలకు కలిసి వచ్చేలా ఒకే టైటిల్ నిర్ణయించాలని భావిస్తున్నారట. అందుకే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని అసలు టైటిల్ రిలీజ్ ముందు ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. చిరు సరసన బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి