అనుష్క భాగమతి.. మహేష్ స్పైడర్ తో పోటీ పడుతుందా

Published : May 18, 2017, 07:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
అనుష్క భాగమతి.. మహేష్ స్పైడర్ తో పోటీ పడుతుందా

సారాంశం

మహేశ్ బాబు, మురుగదాస్ ల స్పైడర్ సినిమా ఆగస్టుకు వాయిదా ఆగస్టులోనే విడుదలకు ప్లాన్ చేసిన అనుష్క భాగమతి మరి అనుష్క భాగమతి, మహేష్ స్పైడర్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయా 

బాహుబలి చిత్రంలో దేవసేనగా నటించిన అనుష్క ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న భాగమతి చిత్రంలో నటిస్తోంది. పిల్ల జమిందార్, సుకుమారుడు లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలను తెరకెక్కించిన అశోక్ ఈ సినిమాకు దర్శకుడు.

 

థ్రిల్లర్ జేనర్లో తెరకెక్కుతున్న.. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో యూనిట్ సభ్యులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. యువి క్రియేషన్స్ బేనర్ పై తెరకెక్కిన "భాగమతి" చిత్రాన్ని ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేయాలని ఇప్పటికే ప్లాన్ చేశారు. కానీ మహేష్ బాబు, మురుగదాస్ ల 'స్పైడర్' సినిమాను కూడా అప్పుడే రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో భాగమతి యూనిట్ కన్ఫ్యూజన్ లో పడ్డారు.

 

స్పైడర్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉండటంతో.. ఇప్పటికే వాయిదాలు ఎక్కువైన మహేష్ మూవీ రిలీజ్ డేట్ పక్కాగా ప్రకటించిన తరువాతే... భాగమతి సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు. మహేష్ స్పైడర్ వాయిదా పడితే ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 11న భాగమతి సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు స్పైడర్ రిలీజ్ అయితే రెండు వారాలు ఆలస్యంగా ఆగస్టు 25న భాగమతి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Ranveer vs Deepika: బాక్సాఫీస్ దగ్గర భార్యదే పైచేయి.. భర్త వెనుకబడింది ఇక్కడే!
Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?