దాదా  సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది:  మెగాస్టార్ చిరంజీవి!

Published : Apr 25, 2017, 12:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
దాదా  సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది:  మెగాస్టార్ చిరంజీవి!

సారాంశం

కళాతపస్వి కె.విశ్వనాథ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి దాదా  సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చిందన్న మెగాస్టార్ రేపు ఉదయం విశ్వనాథ్ ను కలవనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ కు  ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కె విశ్వనాథ్ కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంంబంతో విశ్వనాాథ్ కు అథ్యంత సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల చిరు కుటుంబసభ్టులు ఆనందం వెలిబుచ్చారు.

 

ఈ సంద‌ర్భంగా  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వ‌నాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని కాకుండా కుటంబ ప‌రంగాను మంచి  రిలేషన్ ఉంది. ఆయ‌న‌కు  ఈ అవార్డు రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతికి లోన‌వుతున్నా. అవార్డు  రావాల్సిన స‌మ‌యంలో వ‌చ్చిందా?  లేదా అన్న దానిపై ఇప్పుడు  మాట‌లు అన‌వ‌స‌రం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వ‌రించాల్సింది. కానీ కాస్త ఆల‌స్య‌మైన అవార్డు ఆయ‌న్ను వ‌రించ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న ఎలా ఫీల్ అవుతున్నారో తెలియ‌దు గానీ, మేము మాత్రం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఆయ‌న‌కు అవార్డు రావ‌డం తో ఆ అవార్డుకు నిండుద‌నం వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా శుభాబివంద‌నాలు తెలుపుతున్నా. ఎప్ప‌టికీ ఆయ‌న ఆశీస్సులు కోరే మ‌నిషినే..ఆయ‌న చిరంజీవినే` అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?