
బాలీవుడ్ బాద్ షా.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకండా చెప్పనక్కర్లేదు. ఆయన వరుస ప్లాపులుఎదుర్కొన్నా.. ఆయనపై అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అందుకు తగ్గట్టగానే.. లాంగ్ గ్యాప్ తీసుకుని.. పఠాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు షారుఖ్. సాలిడ్ కమ్ బ్యాక్ తో పాటు.. ప్లాప్ సినిమాల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ కు ఊపిరి ఊదాడు. టాలీవుడ్ దెబ్బకు పడిపోయిన బాలీవుడ్ ను కాస్త పైకి లేపాడు. ఇక తాజాగా ఆయన జవాన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.
అయితే సౌత్ స్టార్స్ అన్నా.. సౌత్ మేకర్స్ అన్నా ఇంట్రెస్ట్ చూపించని షారుఖ్ ఖాన్.. ఆసారి మాత్రం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. 2023 సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా యమా జోరుగా సాగుతున్నాయి. అంతే కాదు ఈ మూవీ ప్రమోషన్స్ లో షారుక్ అభిమానులు కూడా భాగం అవుతున్నారు.
ఇప్పటికే విడుదలైన 'జవాన్' ప్రీవ్యూ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలానే రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యాజికల్ కంపోజిషన్ లో వచ్చిన రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ దో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అటు నార్త్.. ఇటు సౌత్ లో సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు. సౌత్ లో కూడా మార్కెట్ ను గట్టిగా టార్గెట్ చేశాడు షారుఖ్. అందుకే సౌత్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు.. హీరోయిన్ ను కూడా సౌత్ నుంచే తీసుకున్నాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. జవాన్ మ్యానియాని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేలా ఇప్పుడు ఓ అభిమాని షారూఖ్ నివాసమైన మన్నత్ ముందు అద్భుతమైన వాల్ ఆర్ట్ ను రూపొందించాడు.
షారుక్ ఖాన్ వీరాభిమాని అయిన ఆర్టిస్ట్ కనక్ నంద, మన్నత్ చుట్టూ 'జవాన్' ఆర్ట్ వర్క్ సృష్టించారు. దీని ఫోటోలు, వీడియోలను కింగ్ ఖాన్ ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఇవి ప్రస్తుతం ఈ పెయింట్ ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ అందించేందుకు జవాన్ రెడీ అవుతుండడంతో, ఎప్పుడెప్పుడు తమ హీరోని బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని అభిమానులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు.