లవ్ స్టోరీ, పెళ్లిపై ఫస్ట్ టైం స్పందించిన వరుణ్ తేజ్.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారో తెలుసా?

By Asianet News  |  First Published Aug 17, 2023, 4:49 PM IST

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ అయ్యి రెండు నెలలు గడిచింది. ఇక తాజాగా మెగా ప్రిన్స్ తమ లవ్ స్టోరీ, పెళ్లి ఫస్ట్ టైం స్పందించారు. అలాగే లావణ్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  ప్రస్తుతం తన కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. చివరిగా విడుదలైన ‘గని’ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో రాబోయే చిత్రాలపై మరింతగా ఫోకస్ పెట్టారు. మరింత శ్రద్ధ వహిస్తున్నారు. ఈ సందర్భంగా నెక్ట్స్ భారీ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 25న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈసందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ వరుణ్ తేజ్ చురుకుగా పాల్గొంటున్నారు. 

ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ కు సినిమాతోపాటుగా.. తన లవ్ స్టోరీ, పెళ్లిపైనా ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందుకు మొదటిసారిగా స్పందించారు. ఆసక్తికరంగా బదులిచ్చారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ‘నాకు పర్సనల్ విషయాలను సీక్రెట్ గా ఉంచడమంటే ఇష్టం. అందుకే మా లవ్ స్టోరీని దాచేశాం. లావణ్యకు నాకు మధ్య ఐదేళ్లుగా లవ్ కొనసాగుతోంది. నాకు ముందు తను బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంది. మా అభిప్రాయాలు కలవడంతో ఇంకాస్తా ముందుకు వెళ్లాం. మా విషయాన్ని ఇంట్లో పెద్దలు కూడా అంగీకరించడంతో పెళ్లి వరకు వచ్చింది. ఇక లావణ్యకు ముందు నేనే ప్రపోజ్ చేశాను. 

Latest Videos

undefined

అన్ని విషయాలను ఓపెన్ అవ్వడం ఇష్టం లేకే ప్రేమ విషయాన్ని దాచేశాను. అందుకే ఎంగేజ్ మెంట్  కూడా చాలా సింపుల్ గా జరిగింది. ఇక పెళ్లి కూడా అంతే సింపుల్ గా చేసుకోవాలని భావిస్తున్నాను. ఇక లావణ్య చాలా మేచ్యుర్డ్ గా ఉంటుంది. నాకు ఏం కావాలో తనకి బాగా తెలుసు. నాకు చాలా గిఫ్ట్ ఇచ్చింది. నేను వాడే ఐఫోన్ లాంటివి చాలా ఇచ్చింది. నా పట్ల చాలా కేరింగ్ గానూ ఉంటుంది.’ అని చెప్పుకొచ్చారు. 

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్ మెంట్ కు మెగా ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లికి ఇంకాస్తా టైం ఉండటంతో డేటింగ్ కు వెళ్తూ ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన  ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక వీరి పెళ్లి నవంబర్ లేదా డిసెంబర్ లో ఉంటుందని తెలుస్తోంది. అదీ కూడా ఇటలీలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

సినిమాల విషయానికొస్తే...  ‘గాంధీవధారి అర్జున’ చిత్రం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కుతోంది. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో  రిలీజ్ కానుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈమూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వరుణ్ జోడీగా  సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. నాజర్ కీలక పాత్ర పోషించారు. 

ఈ చిత్రం అనంతరం వరుణ్ తేజ్ డెబ్యూ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఇతర డిటేయిల్స్  అందించారు. చిత్రానికి ' ఆపరేషన్ వాలంటైన్' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు.  ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మానుషీ చిల్లర్ కథానాయిక.  డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 

click me!