రామ్ చరణ్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. సోషల్ మీడియాలో ప్రభాస్, మహేశ్ ను దాటిన చెర్రీ క్రేజ్.!

Published : Nov 29, 2022, 01:16 PM ISTUpdated : Nov 29, 2022, 01:17 PM IST
రామ్ చరణ్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..  సోషల్ మీడియాలో ప్రభాస్, మహేశ్ ను దాటిన చెర్రీ క్రేజ్.!

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన చెర్రీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయికి చేరుకుంది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ‘రంగస్థలం’ నుంచి విభిన్న కథలతో భారీ చిత్రాల్లో నటిస్తూ వస్తున్న చరణ్ ప్రస్తుతం.. దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా చేరిపోయారు. చరణ్ నటించే సినిమాలు, ఆయన కనబరుస్తున్న వ్యక్తిత్వానికి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా RRRలో చరణ్ పెర్ఫామెన్స్ తో వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో  సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుతోంది.

తాజాగా చరణ్ ఇన్ స్టా అకౌంట్లో 10 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత  దాదాపు 20 లక్షల ఫాలోవర్స్ ను చెర్రీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం.. తన ప్రాజెక్ట్స్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేస్తుండటంతో చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు.. అయినా 9 మిలియన్ల ఫాలోవర్స్ వద్దే ఆగిపోయారు. ఇక మహేశ్ పాన్ ఇండియాలో అడుగుపెట్టకపోయినా 9.2 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. అయితే వీరి క్రేజ్ ను దాటి మరీ చెర్రీ సోషల్ మీడియాలో హవా చూపించడం విశేషం. దీంతో ఇటీవల మ్యాన్ ఆఫ్  మాసెస్ అనే టైటిట్ లో ఫ్యాన్స్ చెర్రీని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక టాలీవుడ్ లోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ను కలిగిన హీరోగా మొదటి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఉన్నారు. దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్స్ ను బన్నీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ 17 మిలియన్ల ఫాలోవర్స్ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. 

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత  రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్సీ15’లో శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్  ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. త్వరలో పూర్తి కానుండటంతో తాజాగా నెక్ట్స్ ఫిల్మ్  ను కూడా అనౌన్స్ చేశారు. సెన్సేషన్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ‘ఆర్సీ16’ను ఫైనల్ చేశారు.  నిన్న అధికారికంగా ప్రకటన కూడా వచ్చిన  విషయం తెలిసిందే. పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చే ఏడాది RC16 పట్టాలెక్కనుంది. ఇక 2023లోనే చెర్రీ  నటిస్తున్న RC15 కూడా ప్రేక్షకుల  ముందుకు రానుంది. డిసెంబర్లో ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందే అవకాశం ఉంది.

 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే