`హిట్‌ 3`లో హీరో ఫైనల్‌.. `హిట్‌ 2`లో ట్విస్ట్ అదే?.. నాని హింట్‌..

Published : Nov 29, 2022, 11:50 AM IST
`హిట్‌ 3`లో హీరో ఫైనల్‌.. `హిట్‌ 2`లో ట్విస్ట్ అదే?.. నాని హింట్‌..

సారాంశం

`హిట్‌2` ట్రైలర్‌పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. నాని `హిట్‌3`కి సంబంధించిన హింట్‌ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు నెక్ట్స్ సినిమాలో ఎవరో తేలిపోయింది. 

జనరల్‌గా సినిమా సిరీస్‌, ఫ్రాంఛైజీ అనేది హాలీవుడ్‌లో, ఇతర దేశాల సినిమాల్లో చూస్తుంటాం. మన వద్ద సీక్వెల్స్ తప్ప సిరీస్‌లు, ఫ్రాంఛైజీలు వచ్చింది లేదు. ఈ నేపథ్యంలో `హిట్‌` సినిమా ఫ్రాంఛైజీగా తీసుకురాబోతున్నట్టు నిర్మాత నాని, దర్శకుడు శైలేష్‌ కొలను ప్రకటించడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. `హిట్‌ 2` డిసెంబర్ 2న విడుదల కాబోతుంది. దీంతో మరింత ఉత్సుకత పెరుగుతుంది. ట్రైలర్‌ ఇప్పటికే ఆకట్టుకుంది. 

ఇది రాజమౌళి వంటి దర్శకుడికి కూడా నచ్చింది. ఆయన సోమవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సినిమాపై ప్రశంసలు కురిపించారు. విలన్‌ ఎవరనేది సస్పెన్స్ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుందన్నారు. ఇలాంటి ఫ్రాంఛైజీ ఆలోచన చాలా గొప్ప నిర్ణయమని అందుకు నాని, దర్శకుడు శైలైష్‌, ప్రశాంతిలకు ఆయన అభినందనలు తెలిపారు. హిట్‌కి ఇప్పుడు అభిమానులు ఏర్పడ్డారని, హీరో ఎవరనేది కాకుండా సినిమా సిరీస్‌కి అభిమానులు ఏర్పడటం, అది ఇంత సక్సెస్‌ కావడం గొప్ప విషయమన్నారు. సినిమా ఆల్‌రెడీ హిట్‌ అయినట్టే అని చెప్పారు రాజమౌళి. అదే సమయంలో ప్రతి సినిమాని ప్రతి ఏడాది ఒక సీజన్‌లో విడుదల చేయాలని, అది `హిట్‌` సీజన్‌ అనే పేరు తీసుకురావాలన్నారు జక్కన్న. 

ఇదిలా ఉంటే `హిట్‌ 2` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిర్మాత నాని పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. నెక్ట్స్ సినిమాకి సంబంధించిన హింట్‌ ఇచ్చాడు. `హిట్‌ 2` క్లైమాక్స్ లో `హిట్‌3` హీరో ఎవరో రివీల్‌ అవుతుందని, క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ ఉంటుందని సినిమాపై అంచనాలను పెంచారు. ఊరించారు. ఇదిలా ఉంటే `హిట్‌3`లో విజయ్‌ సేతుపతి హీరోగా చేయబోతున్నారనే టాక్‌ వినిపిస్తుంది. ఆల్మోస్ట్ ఫైనల్‌ అయ్యారని, అది కూడా వెంటనే ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. 

అయితే ఇందులో అడవి శేషు కూడా కనిపిస్తారట. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ ఆ విషయాన్ని స్పష్టం చేశారు. విజయ్‌ సేతుపతి మెయిన్‌రోల్‌ చేయబోతుండగా, మరో కీలక పాత్రలో అడవి శేష్‌ కనిపిస్తారని సమాచారం. `హిట్‌2`లోని కేడీ పాత్రకి కొనసాగింపుగా ఆయన పాత్ర ఉంటుందట. ఇదిలా ఉంటే ఇందులో నాని కూడా కనిపించబోతున్నారనేది మరో ట్విస్ట్. మరి ఆయన గెస్ట్ గా మెరుస్తారా? విలన్‌గా కనిపిస్తాడా? `హిట్‌ 4`కి హీరోగా మెరుస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది అమెరికా బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందని సమాచారం. ఇక మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన `హిట్‌ 2` అడవిశేషుతో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. డిసెంబర్‌ 2న తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. కొన్ని రోజుల గ్యాప్‌తో హిందీలోనూ రిలీజ్‌ చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?
Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ