అఫిషీయల్.. తెలుగు వెర్షన్ లో ‘రంజితమే’ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

Published : Nov 29, 2022, 12:03 PM ISTUpdated : Nov 29, 2022, 12:09 PM IST
అఫిషీయల్.. తెలుగు వెర్షన్ లో ‘రంజితమే’ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

సారాంశం

తమిళ స్టార్ హీరో విజయ్ - రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘వారసుడు’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి తమిళ వెర్షన్ లో ఫస్ట్ సింగిల్ విడుదలవ్వగా...తాజాగా తెలుగు వెర్షన్ ను విడుదలకు సిద్ధం చేశారు.  

తెలుగులో తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) డైరెక్ట్ గా చేస్తున్న తొలిసినిమా ‘వారసుడు’ (Varasudu). వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను  శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళంలో ‘వరిసు’ (Varisu)గా రిలీజ్ కాబోతోంది. రెగ్యూలర్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తది దశకు చేరుకోవడంతో సినిమా నుంచి అప్డేట్స్ నూ అందిస్తూ వస్తున్నారు.

తెలుగు, తమిళంలో బైలింగ్వుల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటిప్పటికే తమిళ వెర్షన్ లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ‘రంజితమే’ (Ranjithame) టైటిల్ తో నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చినర తొలి పాట మిలియన్ల వ్యూస్ ను దక్కిచుకుంది. ప్రస్తుతం అదే టైటిల్ తో ‘రంజితమే’ సాంగ్ ను తెలుగు వెర్షన్ లో విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 9:09 నిమిషాలకు సాంగ్ రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫిషియల్ అప్డేట్ అందించారు. ఇప్పటికే ఈ సాంగ్ తెలుగులో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులు సంతోషిస్తున్నారు. 

‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వంశీ పైడిపల్లి తొలిసారి దర్శకత్వం హిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘వారసుడు’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నట్టు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిన్ననే మరోసారి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?