చెర్రీ కోసం కంటతడి పెట్టుకున్న చిన్నారి.. న్యూ యార్క్ లో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా!

Published : Feb 23, 2023, 05:02 PM IST
చెర్రీ కోసం కంటతడి పెట్టుకున్న చిన్నారి.. న్యూ యార్క్ లో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా!

సారాంశం

‘ఆర్ఆర్ఆర్’తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా న్యూ యార్క్ కు వెళ్లిన చెర్రీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ పలికారు.   

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్  ‘ఆర్ఆర్ఆర్’(RRR). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ఈ మల్టీస్టారర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి.. సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఎంతటి క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా వచ్చే రెస్పాన్స్ మామూలుగా లేదు. చివరిగా ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు వేడుకలో చిత్ర యూనిట్ సందడి చేసిన విషయం తెలిసిందే. 

ఇక తాజాగా రామ్ చరణ్ ‘ఆస్కార్2023’ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికాలో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ  సందర్భంగా ఫేమస్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొన్నారు. ఈ విధంగా ‘ఆస్కార్క్’ కోసం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈక్రమంలో న్యూయార్క్ కు చేరుకున్న చెర్రీకి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వెల్కమ్ చెప్పారు. మెగాపవర్ స్టార్ అంటూ సందడి చేశారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇదే సమయంలో ఓ చిన్నారి కూడా చరణ్ తో సెల్ఫీ కోసం ఎదురుచూసింది. ఏకంగా కంటతడి పెట్టుకొని చరణ్ చూపు తనపై పడేలా చేసింది. దీంతో చరణ్ ఆ పాప దగ్గరకు వెళ్లి సెల్ఫీ ఇచ్చి.. ఖుషీ చేశారు. 

మరోవైపు ఫ్యాన్స్ కూడా పెద్దఎత్తున్న చరణ్ వెళ్లిన ప్రాంతాల్లో గూమిగూడారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చరణ్ క్రేజ్ కు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఇక RRR చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఆయా అవార్డులనూ సొంతం చేసుకుంది. సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆస్కార్స్’బరిలోనూ ఈ చిత్రం నిలిచింది. ఒరిజినల్ స్కోర్క్ విభాగంలో ‘నాటు నాటు’ Naatu Naatu నామినేట్ అయ్యింది. మార్చి 12న అమెరికాలో జరగనున్న Oscars 2023 అవార్డుల ప్రదానోత్సవంలోనూ గౌరవం దక్కుతుందని ఇండియన్ ఆడియెన్స్, ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు. ఆ తర్వాత ‘ఆర్సీ16’లో బుచ్చిబాబు డైరెక్షన్ లో నటించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్