
యాక్టింగ్ తో పాటు.. గ్లామర్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మారుతూ..మార్పులు చేసుకుంటూ వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. తనకంటూ కొత్త ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నించాడు...కష్టపడ్డాడు, అనుకున్నది సాధించి చూపించాడు. ఈక్రమంలో తండ్రి పలుకుపడి ఎలాగో ఉన్నా.. చరణ్ కష్టం కూడా అందులో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమా నుంచి చరణ్ లో చాలా మార్పు కనిపించింది. నటుడిగా, వ్యక్తిగా నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్..ఒకప్పుడు ఎంతో మంది విమర్షలకు గురయ్యాడు. తండ్రి వల్ల వచ్చాడు కాని..నటన రాదు అని ట్రోల్స్ చేసినవారెందరో... ఆస్థాయి నుంచి వరల్డ్ స్టార్ డైరెక్టర్ జెమ్స్ కామరూన్ కూడా శభాష్ అనేలా ఎదిగి చూపించాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తో అతని స్థాయి ఏ రేంజ్ కు వెళ్ళిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడుదేశమంతా రామ్ చరణ్ సినిమాఎప్పుడు వస్తుందా అని ఎదరు చూసే పరిస్థితి ఉంది.
ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్లతోన్న రామ్ చరణ్ గతంలో ఎలా ఉండేవాడు చాలామందికి తెలియదు. ఒకప్పుడు రామ్‌చరణ్‌ను, ఇప్పటి చరణ్‌ను చూస్తే ఇద్దరూ ఒకటేనా అనే డౌట్ పక్కాగా వచ్చి తీరుతుంది. అంతలా మార్పు చణ్ లో కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తాను మారుతూ.. తన నటనను మార్చుకుంటూ.. ఎదిగాడు మెగా పవర్ స్టార్. చరణ్ అప్పుడు ఎలా ఉన్నాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడు అనడానికి ఉదాహరణగా.. ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈవీడియో.. చరణ్ కెరీర్ బిగినింగ్ లో యాక్టింగ్ స్కూల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటిది.
ఈ వీడియోలో చరణ్ యాక్టింగ్ నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యాడు. అందరు స్టూడెంట్స్ తో పాటు.. ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన ఫస్ట్ క్లాస్ లో.. ఆడిషన్ ఇస్తూన్న వీడియో బయటకు వచ్చింది. అందులో యాక్టింగ్ ఏమీ లేదు. కానీ అప్పటి జులపాట జుట్టు, అమాయక ముఖం అస్సలు పోలిక లేకుండా.. ఇతను మన మెగా పవర్ స్టార్ రామ్ చరణేనా అన్నట్టుగా ఉన్నాడు.
చరణ్ సినిమాల్లోకి రావడానికి ముందుకు ముంబయిలోని ఓ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో మెళకువలు నేర్చుకున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పుడు వైరల్ వీడియో అక్కడిదే. యాక్టింగ్ స్కూల్‌లో తొలి నాళ్లలో నేర్పించే ఓపెన్ అప్ ఎక్సర్‌సైజ్‌ను చరణ్ చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. అదే సమయంలో వెనుక కూర్చున్న తన బ్యాచ్‌మేట్‌లు నవ్వడం కూడా ఆ వీడియోలో గమనించొచ్చు. అయితే ఆ వీడియో కింద రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి.ఇక ఈవీడియో చూసిన మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు. చరణ్ ఎంత మారిపోయాడో అంటూ తెగ సంబరపడిపోతున్నారు. మా స్టార్ సొంతంగా ఎందిగి చూపించాడంటూ.. గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సెట్స్ మీద ఉన్నాడు రామ్ చరణ్. త్వరలో ఈమూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నాడు. ఇప్పటికే గ్లోబల్ ఇమేజ్ సాధించి మెగా పవర్ స్టార్ కు అటు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.