
`కేజీఎఫ్` సినిమాతో ఇండియన్ సినిమాని షేక్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయారు. `సలార్` చిత్రంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. ప్రశాంత్ నీల్‌లో ఎంత మ్యాటర్ ఉందో ఈ సినిమా చూపించింది. ఇందులోనూ సస్పెన్స్ అంశాలు, స్టోరీని చూస్తే అర్థమవుతుంది. ఓ సంక్లిష్టమైన కథని `సలార్` లో చెప్పబోతున్నారు ప్రశాంత్ నీల్. ఇందులో చాలా స్టోరీస్ మిక్స్ అయి ఉన్నాయి. తీస్తే ఎన్ని సినిమాలైనా తీయోచ్చు అనేలా కథ ఉండటం విశేషం.
`సలార్` ఫస్ట్ పార్ట్ మంచి వసూళ్లని సాధించింది. ఐదు వందల కోట్లు దాటి ఆరు వందల కోట్లకు వెళ్తుంది. అయితే బిజినెస్ లెక్కల ప్రకారం ఈ మూవీ ఇంకా బాగానే రాబట్టాల్సి ఉంది. మరి సంక్రాంతి వరకు రీచ్ అవుతుందా అనేది సస్పెన్స్ నెలకొంది. కానీ ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ కి, మాస్ ఆడియెన్స్ కి బాగా నచ్చింది. యాక్షన్ మూవీస్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ని ఇలా చూడటంతో అంతా హ్యాపీ అవుతున్నారు. డార్లింగ్‌కి సరైన కథ పడితే ఎలా ఉంటుందో `సలార్` చూపించింది.
అయితే `సలార్` ఫస్ట్ పార్ట్ లో చాలా ప్రశ్నలు, అనేక సస్పెన్స్ అంశాలను వదిలేశారు. దీంతో రెండో పార్ట్ పై క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆతృత ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉంది. దీంతో డిమాండ్ స్టార్ట్ అయ్యింది. `సలార్ 2` అప్‌డేట్ కోసం వాళ్లు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. దీంతో తట్టుకోలేక సోషల్ మీడియా వేదికగా తమ డిమాండ్‌ని వినిపిస్తున్నారు.
`అనౌన్స్ సలార్ 2` యాష్ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. `సలార్` సినిమాలో ప్రభాస్ చెప్పే డైలాగ్.. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్` అనే డైలాగ్‌ని వాడుతూ పార్ట్ 2ని ప్రకటించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది. అలాగే `సలార్ 2` షూటింగ్ డిటెయిల్స్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో వచ్చే ఏడాది మార్చి నుంచి `సలార్ 2` ప్రారంభం కాబోతుందనేది రచ్చ చేస్తుంది. ప్రశాంత్ నీల్ దీన్ని గ్యాప్ లేకుండానే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
అయితే పార్ట్ 2కి సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `సలార్` మూవీ ఎండింగ్ చెప్పేందుకు తాను ఎక్కువ ఆతృతతో ఉన్నట్టు తెలిపారు. `సలార్ 2`లో ఎండింగ్ చూపించడానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు తెలిపారు. దీంతో త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఇది ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తుంది. ఇక ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు ప్రధాన పాత్రలు పోషించిన `సలార్` చిత్రం ఈ నెల 22న విడుదలైన విషయం తెలిసిందే. ఇది ప్రపంచ వ్యాప్తంగా 540కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.