`కల్ట్` టైటిల్‌ వివాదం.. విశ్వక్‌ సేన్‌ సినిమాకి `బేబీ` ప్రొడ్యూసర్‌ కౌంటర్‌..

Published : Dec 30, 2023, 10:40 PM IST
`కల్ట్` టైటిల్‌ వివాదం.. విశ్వక్‌ సేన్‌ సినిమాకి `బేబీ` ప్రొడ్యూసర్‌ కౌంటర్‌..

సారాంశం

విశ్వక్‌ సేన్‌ `కల్ట్` పేరుతో ఓ సినిమాని నిర్మించబోతున్నారు. తాజాగా ఆ మూవీ వివాదంలో ఇరుక్కుంది. ఇదే పేరుతో `బేబీ` నిర్మాత టైటిల్‌ ని నమోదు చేయడం ఇప్పుడు రచ్చ అవుతుంది. 

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌.. తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. తన సొంత బ్యానర్లు వన్మయే క్రియేషన్స్, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌ పతాకంపై `కల్ట్` పేరుతో సినిమాని రూపొందిస్తున్నారు. తాజుద్దీన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. అయితే ఈ మూవీకి ట్యాగ్‌ లైన్‌ `లైక్ ఏ లీప్‌ ఇయర్‌ 2024` అని ఇచ్చాడు. కామెడీ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుందట. ఈ సినిమా ద్వారా విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌ ప్రొడక్షన్‌ కూడా లాంచ్‌ చేస్తున్నాడు విశ్వక్‌. 

ఈ సినిమా కథని తనే రాశాడట. తాజుద్దీన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారట. అయితే ఇందులో 25మందిని కొత్తవారిని పరిచయం చేయబోతున్నారట. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలతోపాటు 25 మంది ఆర్టిస్ట్ లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టు చెప్పాడు విశ్వక్‌ సేన్‌. ఆసక్తి గల వారు వీడియోలు సెండ్‌ చేయాలని తెలిపారు. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుందన్నారు. 

ఇదిలా ఉంటే ఇలాంటి టైటిల్‌తోనే గతంలో సినిమాని ప్రకటించాడు `బేబీ` నిర్మాత ఎస్‌కేఎన్‌. `కల్ట్ బొమ్మ` పేరుతో ఆ సినిమాని ప్రకటించారు. తాజాగా విశ్వక్‌ సేన్‌ కూడా `యాష్‌ ట్యాగ్‌ కల్ట్` టైటిల్‌ని ప్రకటించడంతో ఇప్పుడు సరికొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. `కల్ట్ బొమ్మ` సినిమాని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో రిజస్టర చేయించారా? అనే ప్రశ్నలు ఎస్‌కేఎన్‌కి ఎదురవుతున్నాయి. దీంతో ఆయన స్పందించారు. అందరికి ఒకే సమాధానం చెబుతా అంటూ ట్వీట్‌ చేశాడు. 

కొంత మంది మీడియా, ఫ్యాన్స్ నుంచి కాల్స్ వస్తున్నాయని, `కల్ట్ బొమ్మ` టైటిల్‌ని రిజిస్ట్రేషన్‌ లేకుండానే ప్రకటించారా అని అడుగుతున్నారని, ఇలాంటి ప్రశ్నలకు ఒకేసారి స్పష్టత ఇస్తున్నా. `కల్ట్ బొమ్మ` టైటిల్‌ `బేబీ` సినిమా ప్రమోషన్ల నుంచి బాగా పాపులర్‌ అయ్యింది. దీంతో ఆ టైటిల్‌ని కొన్ని నెలల క్రితం తెలుగు ఫిల్మ్ ప్రొడూసర్స్ కౌన్సిల్‌లో నా తదుపరి సినిమాల్లో ఒకదాని కోసం బాధ్యతాయుతమైన చలన చిత్ర సభ్యునిగా, నిర్మాతగా ఈటైటిల్ని రిజిస్టర్‌ చేసుకున్నాం. టైటిల్‌ రిజిస్టర్‌ చేయకుండా ఎలాంటి ప్రకటన ఉండదు. మీ ప్రేమకి ధన్యవాదాలు` అని తెలిపారు ఎస్‌కేఎన్‌.  

ఈ నేపథ్యంలో సరికొత్త కాంట్రవర్సీ తెరపైకి రాబోతుందని అర్థమవుతుంది. నిర్మాత ఎస్‌కేఎన్‌ పోస్ట్ వెనకాల కారణం విశ్వక్‌ సేన్‌ `కల్ట్` మూవీ అయి ఉంటుందని తెలుస్తుంది. ఇది సరికొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తుంది. అయితే ఈ రెండు సినిమాల టైటిల్స్ లో చిన్న డిఫరెంట్స్ ఉంది. కావును అది సమస్యగా మారకపోవచ్చు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో త్వరలో చూడాలి. ఇదిలా ఉంటే `బేబీ` సినిమా ఆఫర్‌ని దర్శకుడు సాయి రాజేష్‌ మొదట విశ్వక్‌ సేన్‌కి వెళ్లాడని, కానీ ఆయన రిజక్ట్ చేసినట్టు తెలిపారు. ఆ సమయంలో విశ్వక్‌ సేన్ కూడా స్పందించారు. అది పెద్ద వివాదంగా మారింది. దీంతో ఇప్పుడు విశ్వక్‌ సేన్‌ అదే టైటిల్‌ని ప్రకటించడం, `బేబీ` నిర్మాత అదే టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించడం ఇప్పుడు రచ్చగా మారబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌