హనుమాన్ గా రామ్ చరణ్..? డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్న మెగా పవర్ స్టార్..?

By Mahesh JujjuriFirst Published Jul 6, 2024, 6:26 PM IST
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హనుమాన్ గా కనిపించబోతున్నాడా..? తండ్రి చేయాల్సిన పాత్రను తాను చేయబోతున్నాడా..? యూనివర్సల్ ఇమేజ్ ఉన్నఈ హీరో.. హనుమాన్ గా కనిపించబోయే సినిమా ఏది...? 
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యూనివర్సల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో అదరగొట్టిన ఈ హీరో..  వరుసగా పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది ఇంతకీ అదేంటంటే.. రామ్ చరణ్ హనుమాన్ గా కనిపించబోతున్నాడట. హనుమాన్ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడట. ఇంతకీ ఏ సినిమాలోనో తెుసా..? 

ఈమధ్యే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో  యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో వచ్చిన హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మహేష్ బాబు సినిమాను కూడా పక్కకు నెట్టి... చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్.. భారీ విజయం సొంతం చేసుకుంది. దాదాపు 400 కోట్ల వరకూ కలెక్షన్స్ కూడా సాధించింది మూవీ.  అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

Latest Videos

ఒక మనిషికి ఆంజనేయస్వామి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? ఆంజనేయస్వామి తిరిగొస్తే ఎలా ఉంటుంది అని ఇంట్రెస్టింగ్  కథతో ఈసినిమా తెరక్కింది. అయితే ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించారని అప్పట్లో ప్రచారం జరిగింది. కాని అదంతా ఫేక్ అని రిలీజ్ తరువాత తెలిసింది. అయితే మెగాస్టార్ కళ్ళను మాత్రం ఆంజనేయ స్వామి పాత్ర కోసం వాడుకున్నాడు దర్శకుడు. 


అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ కూడా అనౌన్స్ చేసారు టీమ్. ఆ సినిమాకు  జై హనుమాన్  అని టైటిల్ కూడా పెట్టారు. ఇక్కడే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే.. హనుమంతుడి పాత్ర ఏ హీరో చేస్తారు అని అంతా చర్చించుకున్నారు. ఫస్ట్ పార్ట్ లో నుమంతుని చూపించలేదు కాని.. ప్రీక్వెల్ లో మాత్రం తప్పకుండా చూపించాల్సిన పరిస్థితి. గతంలో చిరంజీవి చేస్తాడుఅని టాక్ వచ్చింది. ఆతరువాత రానా పేరు వినిపించింది. కాని ఇద్దరు ఇందులో నటిం చడంలేదని సమాచారం. 

ఈ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తారని తెలుస్తోంది.  హనుమాన్ నిర్మాత చైతన్యఈ విషయంలో  మాట్లాడుతూ.. హనుమాన్ పాత్రకి ఎవరినీ అనుకోలేదు అన్నారు. అయితే తమ మనస్సులో మాత్రం మెగాస్టార్ చిరంజీవి కాని.. రామ్ చరణ్ కాని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారట. వాళ్లను కలిసి రివ్వెస్ట్ చేస్తామని అన్నారు.  . దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారగా మెగా అభిమానులు ఇది నిజమయి చరణ్ కానీ చిరంజీవి కానీ హనుమంతుడి పాత్ర చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరి జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారో చూడాలి. రామ్ చరణ్ అయితే రచ్చ రచ్చే అని చెప్పాలి. 

click me!