శర్వానంద్ 'మనమే' ఓటిటి రిలీజ్ అప్డేట్.. ఎప్పుడు, ఎందులో అంటే..

Published : Jul 06, 2024, 04:26 PM IST
శర్వానంద్ 'మనమే' ఓటిటి రిలీజ్ అప్డేట్.. ఎప్పుడు, ఎందులో అంటే..

సారాంశం

శర్వానంద్ చివరగా నటించిన చిత్రం మనమే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7 న విడుదలై నిరాశపరిచింది.

శర్వానంద్ చివరగా నటించిన చిత్రం మనమే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7 న విడుదలై నిరాశపరిచింది. ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి తల్లిదండ్రులుగా నటించారు. 

శర్వానంద్, కృతి శెట్టి నటన ఆకట్టుకుంది. శర్వానంద్ నటనతో ఆకట్టుకుంటునప్పటికీ అతడికి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. కొన్ని చిత్రాలు యావరేజ్ గా ఆడుతున్నాయి. పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎక్కువ భాగం విదేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఫలితంగా తెలుగు ఆడియన్స్ కి ఈ చిత్రంలో ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు. 

ఏది ఏమైనా ఈ చిత్రం విడుదలై నెలరోజులు గడచిపోయింది. ఇక ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చే సమయం ఆసన్నం అయింది. ఈ చిత్ర ఓటిటి రిలీజ్ కి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. జూలై 12 నుంచి ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన రాలేదు కానీ.. జూలై 12 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రంలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. 

ఇదే కనుక జరిగితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. థియేటర్స్ లో ఆదరణ లభించిన కొన్ని యావరేజ్ చిత్రాలు ఓటిటిలో అదరగొడుతున్నాయి. మనమే చిత్రానికి ఓటిటిలో సాలిడ్ రెస్పాన్స్ ఉంటుంది అని అంతా అంచనా వేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rukmini Vasanth: రష్మిక మందన్నా మాజీ ప్రియుడి గురించి నిజాలు బయటపెట్టిన రుక్మిణి వసంత్‌, అస్సలు ఊహించరు
Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?