గేమ్ ఛేంజర్ అప్డేట్..హమ్మయ్య, రాంచరణ్ కి బిగ్ రిలీఫ్

Published : Jul 06, 2024, 05:05 PM IST
గేమ్ ఛేంజర్ అప్డేట్..హమ్మయ్య, రాంచరణ్ కి బిగ్ రిలీఫ్

సారాంశం

ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం వాయిదా పడుతూనే ఉంది. ఈ చిత్రం ఆలస్యం అవుతుండడంతో చరణ్ ఫాన్స్ కూడా అసహనం వ్యక్తం చేయడం చూశాం.

ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం వాయిదా పడుతూనే ఉంది. ఈ చిత్రం ఆలస్యం అవుతుండడంతో చరణ్ ఫాన్స్ కూడా అసహనం వ్యక్తం చేయడం చూశాం. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కారణంగా చరణ్ మరో మూవీ పై ఫోకస్ చేయలేకున్నాడు. 

రాజకీయం, ఎలక్షన్ సిస్టమ్ పై శంకర్ తెరకెక్కిస్తున్న పవర్ ఫుల్ చిత్రం ఇది. ఈ చిత్రంలో రాంచరణ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని టాక్. శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఎట్టకేలకు ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ కి చిన్నపాటి గుడ్ న్యూస్ వచ్చింది. నేటితో రాంచరణ్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడట. 

రాంచరణ్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే అది కూడా పూర్తవుతుంది అని అంటున్నారు. ఇతర సన్నివేశాలని శంకర్ అతి త్వరలో పూర్తి చేయనున్నారు. తన షూటింగ్ పూర్తయింది కాబట్టి రాంచరణ్ కి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. 

ఇకపై చరణ్ బుచ్చిబాబు చిత్రానికి సంబంధించిన ప్రిపరేషన్ మొదలు పెట్టొచ్చు. ఇక దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించడమే మిగిలి ఉంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 50 వ చిత్రంగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌