రామ్ చరణ్ ను వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు, మెగా పవర్ స్టార్ ఏం చేశారంటే..?

Published : Jan 20, 2024, 01:07 PM IST
రామ్ చరణ్ ను వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు, మెగా పవర్ స్టార్ ఏం చేశారంటే..?

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాలోఅయ్యారు. ఆయన కారును వెంబడించారు. దాంతో మెగా పవర్ స్టార్  ఏం చేశారంటే..? 

ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చివరిదశ షూటింగ్ కొనసాగుతుండగా.. చరణ్ బీజ బిజీగా గడిపేస్తున్నారు.  ప్రస్తుతం శంకర్  అండ్ టీమ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నారు.  ఎప్పుడో రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు.  కాగా తమిళనాట ఇండియన్ 2 షూటింగ్ కంప్లీట్ చేసిన డైరెక్టర్ శంకర్.. ప్రస్తుతం చరణ్ సినిమాపై ఫోకస్ పెంచారు. 

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్  హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలారం ఏరియాల్లో జరుగుతుంది. గత నాలుగు రోజులుగా అక్కడే  గేమ్ ఛేంజర్ షూట్ జరుగుతుంది. చరణ్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున చరణ్ ని చూడటానికి తరలి వస్తున్నారు. షూట్ ప్లేస్ నుంచి కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా లీక్ అవుతున్నాయి. అయితే ఈ పరిణామాలు మూవీ టీమ్ కు తలనొప్పిగా మారాయి. ఈలోపు మరో సంఘటన చరణ్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. 

 

నిన్న రాత్రి చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమలో.. కొంత మంది వ్యక్తులు చరణ్ కారును ఫాలో అయ్యారు. చరణ్ కారు ఎంత స్పీడ్ గా వెళ్లినా సరే.. అంతే స్పీడ్ గా వెంబడించారు.  అయితే చరణ్ కారు ఇంకా స్పీడ్ పెంచి వెళ్లిపోతారేమో అనుకున్నారు అంతా. కానీ చరణ్ కార్ ని స్లో చేసి కార్ విండో దించి తనను ఫాలో అవుతున్న వారికి అభివాదం చేసి దయచేసి జాగ్రత్తగా వెనక్కి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేశాడు. దాంతో వెంబడించేవారు చరణ్ మాటను గౌరవించి వెనక్కి తగ్గారు. 

దాంతో ఈ వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ సంస్కారం.. వినయం.. ఫ్యాన్స్ పట్ల అతనికి ఉన్న ప్రేమను మెగా అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.  అదే పరిస్థితుల్లో వేరే హీరో ఉంటే.. ఇలానే ప్యాన్స్ వెంబడిస్తే కార్ ని ఇంకా ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారేమో, అని ప్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక చరణ్ ఈమూవీ షూటింగ్ తరువాత బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో మరో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్