నితిన్ - శ్రీలీలా లేటెస్ట్ ఫిల్మ్ ‘ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్’ Extra Ordinary Man OTTలోకి వచ్చేసింది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.. ఎక్కడ చూడొచ్చనే విషయాలు తెలుసుకుందాం..
టాలీవుడ్ హీరో నితిన్ Nithiin - యంగ్ సెన్సేషన్ శ్రీలీల Sreeleela జంటగా నటించిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు.. డిఫరెంట్ టైటిల్ తో రూపొందిన ఈమూవీని వక్కంతం వంశీ డైరెక్ట్ చేశారు. గతేడాది డిసెంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ కు మంచి సక్సెస్ అందిస్తుందనుకుంటూ ఫలితం బెడిసి కొట్టింది.
థియేటర్ల వద్ద ఆడియెన్స్ నుంచి ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేదని తెలుస్తోంది. కానీ నితిన్ పెర్ఫామెన్స్, శ్రీలీలా ఎనర్జీ, కామెడీ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా ‘ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ Disney Plus Hotstar దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ ముగియడంతో ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 19 నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటోంది.