సైరా లో క్రేజీ బ్యూటీ

First Published Sep 3, 2017, 12:42 PM IST
Highlights
  • సైరాలో మరో క్రేజీ హిరోయిన్
  • ఇప్పటికే నయన్ అఫీషియల్, అనుష్క రెడీ
  • మరో హిరోయిన్ గా  చిరు సరసన ప్రగ్యా జైస్వాల్

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసిన చిరు 151వ సినిమా సైరా నరసింహారెడ్డి మూవీ అక్టోబర్ మొదటి వారం నుండి సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని ఎనౌన్స్ చేయగా ఇప్పుడు మరో ఇద్దరు భామలు ఆ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే అనుష్కను కన్ఫమ్ చేసుకున్నట్లు సమాచారం. తాజాగా మరో హిరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా సైరా టీమ్ లో చేరనుందని తెలుస్తోంది. 

 

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి లాంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క కన్ఫమ్ ఐందని తెలుస్తున్నా అధికారికంగా క్లారిటీ రాలేదు.. అయితే ప్రగ్యా జైశ్వాల్ మాత్రం కన్ఫాం అయ్యిందని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఏ.ఆర్.రెహమాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.    

 

సైరా నరసింహారెడ్డిని బాహుబలి తరహాలో అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు. సినిమా మీద అంచనాలను పెంచేలా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. కాస్ట్ అండ్ క్రూ విషయంలో ఎమాత్రం కాంప్రమైజ్ అవ్వని సైరా యూనిట్ సినిమాను ఇండియన్ సినిమా చరిత్రలోనే మరో అద్భుత కళాఖండంగా నిలిపేలా కృషి చేస్తున్నారు.

click me!