జూన్ మొదటివారంలో విడుదలకానున్న "మాయామాల్"

Published : May 15, 2017, 02:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
జూన్ మొదటివారంలో విడుదలకానున్న "మాయామాల్"

సారాంశం

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్య పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్" హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ లో విడుదల    

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్య పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటున్న "మాయామాల్" చిత్రాన్ని జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోవింద్ లాలం మాట్లాడుతూ.. "నేను మూడేళ్లపాటు కష్టపడి రాసుకొన్న కథ ఈ చిత్రం. కథ నచ్చి కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ లు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు రావడం, రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇక "మాయామాల్" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొంది" అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "అనుకున్నదానికంటే సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాలో విలన్ ఎవరనేది ఆసక్తికరమైన అంశం. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, జూన్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రేక్షకుల్ని మా చిత్రం తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు. 

షకలక శంకర్, తాగుబోతు రమేష్, సోనియా, పృథ్వీరాజ్, నాగినీడు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: సతీష్ శెట్టి, యాక్షన్: విజయ్, కళ: రమణ వంక, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, సంగీతం: సాయికార్తీక్, నిర్మాతలు: కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: గోవింద్ లాలం! 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన
Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?