మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. దసరా తర్వాత సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్: అపోలో వర్గాలు

By Siva KodatiFirst Published Oct 8, 2021, 5:33 PM IST
Highlights

రోడ్డు ప్రమాదంలో (road accident) తీవ్రంగా గాయపడిన సినీ హీరో సాయిధరమ్ తేజ్ (sai dharam tej) కోలుకుంటున్నారు. ఎడమ భుజానికి తీవ్రగాయం కావడంతో ఆయనకు రెండు సార్లు సర్జరీ చేశారు వైద్యులు. ప్రత్యేక  బృందం పర్యవేక్షణలో ఫిజియోథెరపి నిర్వహిస్తున్నారు డాక్టర్లు

రోడ్డు ప్రమాదంలో (road accident) తీవ్రంగా గాయపడిన సినీ హీరో సాయిధరమ్ తేజ్ (sai dharam tej) కోలుకుంటున్నారు. ఎడమ భుజానికి తీవ్రగాయం కావడంతో ఆయనకు రెండు సార్లు సర్జరీ చేశారు వైద్యులు. ప్రత్యేక  బృందం పర్యవేక్షణలో ఫిజియోథెరపి నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో దసరా తర్వాత సాయిథరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

గత నెల 10వ తేదీన హైదరాబాద్ (hyderabad) మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి (madhapur cable bridge) వద్ద సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. అతి వేగంతో పాటు రోడ్డుపై ఇసుక వుండటంతో ఆయన బైక్ అదుపు తప్పి జారిపడింది. ఈ ఘటనలో సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తొలుత ఆయనను మాదాపూర్ మెడికేర్ ఆసుపత్రికి .. అనంతరం జూబ్లీహిల్స్ అపోలోకి (apollo hospital) తరలించారు. ఆయన కాలర్ బోన్‌కు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు వైద్యులు. నాటి నుంచి సాయితేజ్ అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 

Also  Read:యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్ ట్వీట్‌.. త్వరలో కలుద్దామంటూ.. ఆనందంలో ఫ్యాన్స్

మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదం తర్వాత ఫస్ట్ టైమ్‌ స్పందించారు. ఈ మేరకు అక్టోబర్  3న ఆయన ట్వీట్‌ చేశారు. రైట్‌ హ్యాండ్‌ థంబ్‌ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు. `నాపై, నా చిత్రం `రిపబ్లిక్‌`పై (republice movie) మీ ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు అనే చిన్న పదం రూపంలో తెలియజేస్తున్నా. త్వరలోనే కలుద్దాం` అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తో మెగా అభిమానుల్లో సంతోషాలు స్టార్ట్ అయ్యాయి. 

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన `రిపబ్లిక్‌` చిత్రం అక్టోబర్‌ 1న విడుదలైన విషయం తెలిసిందే. ఇది మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది. దేవా కట్టా (deva katta) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌ (aishwarya rajesh)కథానాయికగా నటించగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.
 

click me!