నేను అబార్షన్‌ చేసుకోలేదు.. ఎవరితోనూ అఫైర్స్ లేవు.. రూమర్స్ పై సమంత సంచలన పోస్ట్

Published : Oct 08, 2021, 04:07 PM ISTUpdated : Oct 08, 2021, 06:45 PM IST
నేను అబార్షన్‌ చేసుకోలేదు.. ఎవరితోనూ అఫైర్స్ లేవు.. రూమర్స్ పై సమంత సంచలన పోస్ట్

సారాంశం

ఇందులో సమంత చెబుతూ, వ్యక్తిగత సంక్షోభంలో మీ భావోద్వేగ పెట్టుబడి నన్ను ముంచెత్తింది. నాపై మీరు చూపిస్తూ డీప్‌ సానుభూతికి, దయ, జాలికి ధన్యవాదాలని తెలిపింది.

సమంత తనపై వస్తోన్న రూమర్స్ పై స్పందించింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌ ద్వారా ఓ సంచలన పోస్ట్ ని అభిమానులతో పంచుకుంది. ఇందులో రూమర్స్ పై ఆమె దుమ్మెత్తిపోసింది. ఘాటుగా స్పందించింది. ఎమోషన్‌తో ఆడుకుంటున్నారని ఆమె మండిపడింది. ఇలాంటి టైమ్‌లో తనని ఒంటరిగా వదిలేయమని వేడుకుంది. తానుకోలుకునే వరకు వేచి ఉండండి అని తెలిపింది. 

ఇందులో సమంత చెబుతూ, వ్యక్తిగత సంక్షోభంలో మీ భావోద్వేగ పెట్టుబడి నన్ను ముంచెత్తింది. నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి, దయ,జాలికి ధన్యవాదాలు. తనపై ఆధారపడి తప్పుడు కథనాలను, తనకు వ్యతిరేకంగా స్టోరీలను స్ప్రెడ్‌ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇందులో నేను ఎఫైర్స్ కలిగి ఉన్నానని, నేను పిల్లలను వద్దనుకుంటున్నట్టు, అవకాశవాదినట్టు, ఇప్పుడు అబార్షన్లు కూడా చేసుకున్నానని రాస్తున్నారు. 

విడాకులు తీసుకోవడమనేది చాలా పెయిన్‌తో కూడిన విషయం. కోలుకునేంత వరకు నన్ను ఒంటరిగా వదిలేయండి. కనికరం లేకుండా వ్యక్తిగతంగా ఇలాంటి దాడులు చేయడం దారుణం. కానీ నేను ప్రామిస్‌ చేస్తున్నా ఇలాంటి విషయాలను స్వాగతించను, నన్నేమి చేయలేవు. మీరనుకుంటున్నట్టు నేను చేయను.` అని తెలిపింది. సమంత, నాగచైతన్య ఈ నెల 2న విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 

సమంత, నాగచైతన్య ఏదేళ్ల స్నేహం, ప్రేమ అనంతరం 2017లో అక్టోబర్ 6న మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. `ఏం మాయ చేసావె` చిత్రంతో అయిన పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరు హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్ గా నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. అయితే వీరిద్దరు విడిపోతున్నారని గత ఆరు నెలలుగా వార్తలొస్తున్నాయి. అనేక కథనాలు వినిపించాయి. వీటిపై ఎప్పుడూ స్పందించలేదు వీరిద్దరు. కానీ డైరెక్ట్ గా విడాకులు ప్రకటించి దిగ్ర్భాంతికి గురి చేశారు. 

related news: ఆడవాళ్లనే తప్పుబడతారా, మగాళ్లని ఎందుకు ప్రశ్నించరు, సమాజానికి నైతికత లేదు... సమంత షాకింగ్ పోస్ట్

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు