రెండెకరాల పొలం కొన్న అల్లు అర్జున్.. ఎమ్మార్వో కార్యాలయంలో సందడి

pratap reddy   | Asianet News
Published : Oct 08, 2021, 05:06 PM IST
రెండెకరాల పొలం కొన్న అల్లు అర్జున్.. ఎమ్మార్వో కార్యాలయంలో సందడి

సారాంశం

రెండెకరాల పొలం కొన్న అల్లు అర్జున్.. ఎమ్మార్వో కార్యాలయంలో సందడి టాలీవుడ్ హీరోలకు వ్యవసాయ భూమిపై మక్కువ పెరుగుతున్నట్లు ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఫామ్ హౌస్ ఉంది.

రెండెకరాల పొలం కొన్న అల్లు అర్జున్.. ఎమ్మార్వో కార్యాలయంలో సందడి టాలీవుడ్ హీరోలకు వ్యవసాయ భూమిపై మక్కువ పెరుగుతున్నట్లు ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఫామ్ హౌస్ ఉంది. పవన్ తరచుగా అక్కడ వ్యవసాయం చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా గోపాలపురం ప్రాంతంలో దాదాపు 6 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నాడు. 

తాజాగా ఆ జాబితాలోకి ఐకాన్ స్టార్ Allu Arjun చేరాడు. శంకర్ పల్లిలో అల్లు అర్జున్ రెండెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం అల్లు అర్జున్ ఎమ్మార్వో కార్యాలయంలో మెరిశాడు. ఉదయం 10 గంటలకు అల్లు అర్జున్ శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నాడు. 

దీనితో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సందడి నెలకొంది. ఎమ్మార్వో కార్యాలయంలోని సిబ్బంది అల్లు అర్జున్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడని తెలుసుకున్న ప్రజలు కూడా కొంతమంది ఎమ్మార్వ్యో కార్యాలయం వద్ద గుమిగూడినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రారంభించాక ఎమ్మార్యో సైదులు అల్లు అర్జున్ కి ప్రొసీడింగ్ ఆర్డర్ అందించారు. 

Also Read: ఎన్టీఆర్ తో సమంత ఆట.. క్రేజీ న్యూస్, విడాకుల తర్వాత తొలిసారి..

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, దాక్కో దాక్కో మేక సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Brahmamudi: రోడ్డుపై ఇందును చూసిన రేఖ..ఎగ్జామ్‌కు వెళ్లిన విషయం బయటపడుతుందా?
Illu Illalu Pillalu: రైస్ మిల్లుకు ఇక రామరాజు పూర్తిగా దూరం, అధికారం వల్లి తండ్రి చేతుల్లోకి...