టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ను మెప్పించిన ‘మసూద’.. దిల్ రాజ్ రిలీజ్ చేస్తున్న చిత్రంపై వారి ఫీలింగ్ ఇదే!

Published : Nov 17, 2022, 06:52 PM ISTUpdated : Nov 17, 2022, 06:54 PM IST
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ను మెప్పించిన ‘మసూద’.. దిల్ రాజ్ రిలీజ్ చేస్తున్న చిత్రంపై వారి ఫీలింగ్ ఇదే!

సారాంశం

మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల తర్వాత ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నిర్మించిన చిత్రం ‘మాసుద’. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ కు స్పెషల్ షోలను ప్రదర్శించారు. దిల్ రిలీజ్ చేయబోతున్న ఈ చిత్రంపై వారు చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.

‘మళ్ళీ రావా’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి థ్రిల్లర్ తరువాత విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మూడో చిత్రంగా మసూద (Masuda) అనే హారర్ డ్రామాని నిర్మించారు.  ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్,. సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీమియర్ ని  చిత్రయూనిట్ తో పాటు... టాలీవుడ్ యువ దర్శకులు కూడా చూశారు.  

ఈ సంద్భంగా వారు చెప్పిన  మాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. దర్శకులు ఏజెంట్ సాయి శ్రీనివాస దర్శకుడు స్వరూప్ అర్. ఎస్. జే.,  కేరాఫ్ కంచర పాలెం దర్శకుడు వెంకటేశ్ మహా, అంటే సుందరానికీ... దర్శకుడు వివేక్ ఆత్రేయ, మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు వినోద్ అనంతోజు, కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ లు మసూద మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే... హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు. ఇలాంటి హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే వారికి కలిగిన అనుభూతి, ప్రేక్షకులకి కూడా కలుగుతుందని చెప్పారు.

జార్జిరెడ్డి, పలాస, టక్ జగదీశ్ చిత్రాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన తిరువీరు.. ‘మసూద’తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. ఈ హార్రర్ డ్రామాలో తిరువీర్ హీరోగా, సంగీత హీరోయిన్ గా  నటించింది. కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు కీలక పాత్రలను పోషించారు. రేపు ప్రేక్షకుల ముందుకు  రాబోతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ