దీన స్థితిలో నటుడు కాంతారావు కుమారులు... ఆదుకోవాలని వేదన!

Published : Nov 17, 2022, 05:19 PM IST
దీన స్థితిలో నటుడు కాంతారావు కుమారులు... ఆదుకోవాలని వేదన!

సారాంశం

పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోవాల్సి రావడం దురదృష్టకరం. బంగ్లాలో బ్రతికిన బ్రతుకులు రోడ్డున పడితే ఆ బాధ వర్ణనాతీతం. లెజెండరీ నటుడు కాంతారావు వారసుల పరిస్థితి ఇలానే ఉంది.   

తొలితరం స్టార్ హీరోల్లో కాంతారావు కూడా ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు అశేష ప్రజాభిమానాన్ని సంపాదించారు. జానపద చిత్రాలకు కాంతారావు చిరునామా మారారు. సాంఘిక, పౌరాణిక, జానపద జోనర్స్ లో 400 వందలకు పైగా చిత్రాలు చేశారు. హీరోగా వెలిగిపోతున్న రోజుల్లో ఆయన చెన్నైలో పెద్ద ఇల్లు నిర్మించుకున్నారు.అక్కడే భార్యాపిల్లలతో నివాసం ఉన్నారు. అన్ని రోజులు ఒకలా ఉండవు అన్నట్లు కాంతారావు తీసుకున్న నిర్ణయాలు ఆయన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. దానికి తోడు హీరో అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. 

కాలం గడిచే కొద్దీ పరిశ్రమలో ఆయన ప్రభావం తగ్గింది. సంపాదన లేకపోవడంతో ఉన్న కొద్ది ఆస్తులు పోగొట్టుకున్నారు. చివరికి హైదరాబాద్ లో భార్య పిల్లలతో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ఆడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన కాంతారావు చివరి చిత్రం బాలకృష్ణ హీరోగా రాఘవేంద్రరావు నిర్మించిన పాండురంగడు. 2009లో కాంతారావు 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన భార్య హైమావతి గత ఏడాది మరణించడం జరిగింది. 

అంత గొప్ప నటుడికి ప్రభుత్వాల నుండి అందిన సాయం ఏమీ లేదు. ఒకటి రెండు సందర్భాల్లో కాంతారావు భార్య హైమావతిని సత్కరించినట్లు గుర్తు.  ఆయనకు ఇద్దరు కుమారులు కాగా ఆర్థిక ఒడిదుకులతో సతమతం అవుతున్నారు. ఇటీవల కాంతారావు శతజయంతి వేడుకలు రవీంద్రభారతిలో జరిగాయి. ఈ సందర్భంగా కాంతారావు వారసులు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. 

జీవితం సినిమాకు అంకితం చేసిన నాన్నగారు ఉన్న ఆస్తులు అమ్మి సినిమాలు నిర్మించారు. ఒకప్పుడు బంగ్లాలో బ్రతికిన మేము నగరానికి దూరంగా అద్దె ఇంటిలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుస్తున్నాము. కావున ప్రభుత్వం మాకు ఒక ఇల్లు కేటాయించి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తండ్రి బ్రతికున్నప్పుడే గుర్తించలేదు. మరి ఆయన వారసుల అభ్యర్ధనలు తెలంగాణా ప్రభుత్వం ఏ మేరకు గుర్తిస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్