సమంత చేతిలోనే ‘యశోద 2’.. సీక్వెల్స్ పై క్లారిటీ ఇచ్చిన దర్శక నిర్మాతలు!

Published : Nov 17, 2022, 05:49 PM IST
సమంత చేతిలోనే ‘యశోద 2’.. సీక్వెల్స్ పై క్లారిటీ ఇచ్చిన దర్శక నిర్మాతలు!

సారాంశం

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’ (Yashoda). ఈ చిత్రానికి సీక్వెల్స్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా ఈ విషయంపై దర్శకులు హరి హరీశ్ క్లారిటీ ఇచ్చారు.   


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు తొలిరోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో పాటు.. కేవలం మూడు రోజుల్లోనే రూ. 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అటు  యూఎస్ఏలోనూ హాఫ్‌ మిలియన్ మార్క్ చేరుకుంది.  

ఈ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. సినిమాను సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు,  సమంత అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఇటీవల ఇండస్ట్రీలొ సక్సెస్ చూసిన చిత్రాలకు సీక్వెల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘యశోద’కు కూడా సీక్వెల్స్ ఉంటాయని అంటున్నారు. దీనిపై దర్శక నిర్మాతలు హరి - హరీశ్ (Hari - Harish), శివలెంక  కృష్ణప్రసాద్ సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. 

'యశోద 2' గురించి చాలా మంది అడుగుతున్నారు.  ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా క్రైమ్స్ పుట్టుకు వస్తున్నాయి. వాటికి పరిష్కరాలూ  ఉంటాయి. ఈ నేపథ్యంలో వచ్చిన 'యశోద'కు ట్రెమండస్‌ రెస్పాన్స్ వస్తోంది. అన్ని భాషల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్నిచ్చింది. 'యశోద 2' విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే... అది సమంత గారిపై ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత, ఆవిడతో డిస్కస్ చేస్తాం. సమంత  ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాం. 'యశోద 2'లో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కూడా ఉంటుందని తెలిపారు. దీంతో ఇక సమంత  పూర్తిగా కోలుకున్నాక ఎలాంటి  నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరీ. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా