
మారుతి సినిమాలంటే మినిమం ఫన్ గ్యారెంటీ ఉంటుంది. అది నానితో చేసిన `భలే భలే మగాడివోయ్` కావచ్చు, సుధీర్ బాబు తో చేసిన ప్రేమకథా చిత్రం లాంటి హారర్ కామెడీ కావచ్చు. ఇవన్నీ కాదని మహానుభావుడు లాంటి కాన్సెప్ట్ బేస్డ్ కథ కావచ్చు. ఏ సినిమా అయినా దానికో లుక్కు, తనకో బ్రాండ్ ఉందని ప్రూవ్ చేసే పనిలో ఉంటాడు. తన సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులను రెడీ చేసుకున్నాడు. తాజాగా సంతోష్ శోభన్ హీరోగా `మంచి రోజులు వచ్చాయి` సినిమాని తెరకెక్కించాడు. ఈమూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను వదిలారు.
వి.సెల్యులాయిడ్- ఎస్.కె.ఎన్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాలనీ నేపధ్యంలో కేవలం 30రోజుల్లో తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన సోసోగా ఉన్నాననీ లిరికల్ వీడియో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను త్వరలో ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మీరు ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
మారుతి మార్క్‌తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. మెహ్రీన్ తండ్రి కూతురిపై ఇన్వెస్టిగేషన్ కథాకమామీషు బోలెడంత ఫన్ ని క్రియేట్ చేస్తోంది.కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మారుతి 'మంచి రోజులొచ్చాయి' చిత్రాన్ని తెరకెక్కించాడని అర్థమవుతోంది. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన సంతోష్ శోభన్, మెహ్రీన్ జంట మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో. ఇక ఈ మూవీని యూవీ క్రియేషన్స్ వారు నిర్మించగా, నవంబర్ 4 న విడుదల కాబోతోంది.
also read: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన సమంత.. ఆ మూవీ పేరు చెప్పేందుకు కష్టాలు, 'ఏ మాయ చేశావే' ప్రస్తావన
మారుతి బ్రాండ్ రొమాన్స్ తో పాటు సిట్యుయేషనల్ కామెడీని వర్కవుట్ చేసారని తెలుస్తోంది. మంచి రోజులు వచ్చాయి లో మరోసారి మారుతి విశ్వరూపం వర్కవుటవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.