కాజల్‌, సిరి, స్వేత, రవి చేసిన పనికి బిగ్‌బాస్‌ సీరియస్‌.. దిమ్మతిరిగే ఫనిష్‌మెంట్‌

Published : Oct 14, 2021, 11:35 PM IST
కాజల్‌, సిరి, స్వేత, రవి చేసిన పనికి బిగ్‌బాస్‌ సీరియస్‌.. దిమ్మతిరిగే ఫనిష్‌మెంట్‌

సారాంశం

బిగ్‌బాస్‌5 ఆరో వారం పూర్తి కావస్తుంది. గురువారం ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. `బీబీ బొమ్మల ఫ్యాక్టరీ`కి సంబంధించి టాస్క్ కెప్లెన్సీ కంటెండర్‌ టాస్క్ లో ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ నియమాలను ఉల్లంగించారు. దీంతో దిమ్మతిరిగే ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు. ఈ వారం కెప్టెన్సీ పోటీకి అర్హత కోల్పోయారని, వారు టాస్క్ నుంచి ఎలిమినేట్‌ అయ్యారని తెలిపారు. మరి బిగ్‌బాస్‌ సీరియస్ కావడానికి కారణమేంటంటే.. 

బిగ్‌బాస్‌5 ఆరో వారం పూర్తి కావస్తుంది. గురువారం ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. `బీబీ బొమ్మల ఫ్యాక్టరీ`కి సంబంధించి టాస్క్ కెప్లెన్సీ కంటెండర్‌ టాస్క్ లో ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ నియమాలను ఉల్లంగించారు. దీంతో దిమ్మతిరిగే ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు. ఈ వారం కెప్టెన్సీ పోటీకి అర్హత కోల్పోయారని, వారు టాస్క్ నుంచి ఎలిమినేట్‌ అయ్యారని తెలిపారు. మరి బిగ్‌బాస్‌ సీరియస్ కావడానికి కారణమేంటంటే.. 

బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ లో భాగంగా గ్రీన్‌ టీమ్‌ అయితే స్వేత,రవి, లోబో చాలా కష్టపడి 25 బొమ్మలు తయారు చేశారు. దీంతో అత్యధికంగా బొమ్మలు తయారు చేసిన టీమ్‌గా నిలిచింది. కానీ అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వేత వర్మ బిగ్‌బాస్‌ ఇంట్లని పిల్లోసి కట్‌ చేసి అందులోనుంచి దూదిని తీసి బొమ్మలుగా కుట్టారు. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ చాలా సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చాడు. 

స్వేత చేసిన పనిని చూసిన బిగ్‌బాస్‌ ఆమె చేసిన విషయం తప్పు అని తెలిపారు. అంతేకాదు వీరు తప్పు చేస్తుంటే సంచాలకులు సిరి, కాజల్‌ తమ పనిని సక్రమంగా చేయలేదని చెబుతూ సిరి, కాజల్‌లతోపాటు గ్రీన్‌ టీమ్‌ కూడా ఈ సారి కెప్టెన్నీ కోసం పోటీపడే అవకాశాన్ని కొల్పోయారు.  ఇది చూసి సన్నీ అనీ మాస్టర్‌ని ఎత్తుకుని పండగ చేసుకున్నారు. అయితే ఈ టాస్క్ లో ప్రియా టీమ్‌కి స్పెషల్‌ పవర్‌ లభించింది. దీంతో ఇతర మూడు టీమ్‌లో ఒక్కరి నుంచి సగం టాయ్స్ తీసుకోవచ్చన్నారు. దీంతో వాళ్లు ఎల్లో టీమ్‌ నుంచి సగం తీసుకున్నారు. షణ్ముఖ్‌ టీమ్‌ సగం అయిపోయింది.

also read: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన సమంత.. ఆ మూవీ పేరు చెప్పేందుకు కష్టాలు, 'ఏ మాయ చేశావే' ప్రస్తావన

మరోవైపు సన్నీ.. కాజల్‌ లాగా నటించి ఇమిటేట్‌ చేసి చూపించడం నవ్వులు పూయించింది. లోబో స్థానాన్ని తాను తీసుకుని ఆద్యంతం నవ్వలు పూయిస్తున్నాడు సన్నీ. మరోవైపు చివర్లో నైట్‌ సమయంలో మానస్‌కి కిస్‌ ఇచ్చింది ప్రియాంక. రాత్రిపూట మాన‌స్ గురించి మీటింగ్ పెట్టారు అమ్మాయిలు. ప్రియా, సిరి, కాజల్‌, ప్రియాంక ఇందులో ఉన్నారు. అత‌డు బాగుంటాడ‌ని సిరి కామెంట్ చేయ‌గా 'నీ దిష్టే త‌గులుతుందే, ఏం క‌ళ్లే అవి..' అంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. దీంతో మ‌రింత రెచ్చిపోయిన సిరి.. ఎంత క్యూట్ ఉన్నాడో అంటూ మాన‌స్‌కేసి చూడ‌గా వెంట‌నే పింకీ ఆమె చూపు తిప్పేస్తూ ప‌డుకోబెట్టింది.

 ఇక హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ విశ్వ విన్నర్‌గా నిలిచారు. నెక్ట్స్ వీక్‌కి ఆయన కెప్టెన్‌గా ఎంపికయ్యారు. బిగ్‌బాస్‌5 సీజన్‌ సెప్టెంర్‌ 5న గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు వారాలు పూర్తయ్యాయి. సరయు, ఉమాదేవి, లహరి, నజరాజ్‌ మాస్టర్‌, హహీద ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆరో వారంలో పది మంది ఎలిమినేషన్‌ సిద్ధంగాఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు