
ఎపిసోడ్ ప్రారంభంలో పిల్లలు చూపించిన వ్యక్తిని పట్టుకొని నా భార్యని ఎక్కడ బంధించారు దీని అంతటికి కారణం ఎవరు అని అడుగుతాడు.అతను జలంధర్ పేరు చెప్తాడు. మరోవైపు అను దగ్గరికి వచ్చిన జలంధర్ నీకు బోర్ కొడుతుందేమో గేమ్ ఆడుకుందామా, గేమ్ పేరు డెత్ బై లక్ నేను షూట్ చేస్తాను, నువ్వు తప్పించుకుంటావు. తప్పించుకుంటే నువ్వు గెలిచినట్లు లేకపోతే నేను గెలిచినట్లు అంటూ ఆమెకి షూట్ పెట్టి ఆమెని బాగా టెన్షన్ పెడతాడు జలంధర్.
ఫస్ట్ బుల్లెట్ ని తప్పించుకుంటుంది అను. రెండోసారి కూడా తప్పించుకుంటుంది. ఈసారి కూడా తప్పించుకున్నారు కానీ మూడోసారి తప్పించుకునే అవకాశం ఇవ్వను అంటాడు జలంధర్. అంతలోనే ఆర్య దగ్గర ఉన్న మనిషి జలంధర్ కి ఫోన్ చేసి భోజనం తెచ్చాను అని చెప్తాడు. అలా చెప్పిస్తాడు ఆర్య. భోజనం కోసం బయటికి వచ్చిన జలంధర్ ఆర్య ని, చూసి షాక్ అవుతాడు.
కోపంతో జలంధర్ పీక పట్టుకుంటాడు ఆర్య. ఇంతలో టెన్షన్ తో అను కేకలు వేయటంతో అదే టైం కి మిగతా వర్కర్లు కూడా వచ్చి మీరు వెళ్ళండి మేము వీడి పని పడతాము అనటంతో జలంధర్ ని వాళ్ళకి వదిలేసి అను దగ్గరికి వచ్చి కట్లు విప్పి దగ్గరికి తీసుకొని అలా ఎవరైనా, ఏమైనా చెప్పగానే వెళ్ళిపోవటమేనా, నీకు ఏమీ జరగలేదు కదా అని కంగారుగా అడుగుతాడు.
మీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను నా విషయంలో ఏం జరిగినా పర్వాలేదు కానీ మీరు క్షేమంగా ఉండాలి అంటుంది అను. నేనుండగా నీకు ఏమీ కానివ్వను ప్రాణం అట్టేసి రక్షించుకుంటాను అంటాడు ఆర్య. ఇద్దరూ బాగా ఎమోషనల్ అవుతారు. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అను చాలా నీరసంగా ఉంది ఆకలేస్తుంది అని చెప్పటంతో గబగబా పాలు వేడి చేసి బన్ తినిపిస్తాడు ఆర్య.
కాళ్లు బాగా లాగుతున్నాయి అని చెప్పటంతో ఆమెకి కాళ్లు కూడా పడతాడు. వద్దు అంటూ అను ఎమోషనల్ అవుతుంది. నువ్వు ప్రమాదంలో పడడానికి నేనే కారణం. ఆస్తిని అధికారాన్ని వదిలేసి వస్తే శత్రువులు దూరం అవుతారు అనుకున్నాను కానీ నామీద గెలవాలని పంతం నా శత్రువుల్ని ఊరికే ఉండనివ్వట్లేదు అంటాడు ఆర్య.
వందమంది నన్ను చుట్టుముట్టినా ఎదుర్కొంటాను కానీ నన్ను గెలవాలని పంతంలో వాళ్లు నీకు ఏదైనా హాని తలపెట్టాలనుకుంటేనే తట్టుకోలేకపోతున్నాను అంటాడు ఆర్య. మీరు ఉండగా నాకు ఏమీ కాదు అంటుంది అను. మనం ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా శత్రువుల నీడ పడనంత దూరానికి వెళ్ళిపోదామా అంటాడు ఆర్య. ఇప్పటికే నా కోసం ఆస్తులు అంతస్తులు వదిలేసి సామాన్యుడిలాగా బ్రతుకుతున్నారు.
ఇప్పుడు ఊరుని కూడా వదిలేసి మీ ఉనికినే కోల్పోతారా అంటుంది అను. నాకు నువ్వే ముఖ్యం అని ఆర్య అంటే ఆపద వస్తే మీరు కాపాడుతారు కానీ అలాంటి ఆపద మన కుటుంబానికి వస్తే ఎవరు కాపాడుతారు, మీరు వాళ్లతో లేకపోయినా వాళ్ళకి అందుకే ఇక్కడే ఉన్నారని తెలిస్తే శత్రువులు వాళ్ళ జోలికి వెళ్ళరు. అందుకే మనం ఇక్కడే దగ్గరలోనే ఉండాలి సార్ అంటుంది అను.
ప్రజెంట్ జనరేషన్లో కట్టుకున్న భర్తకి అయిన వాళ్ళందరినీ దూరం చేసే వాళ్ల గురించి ఎక్కువగా వింటూ ఉంటాము కానీ భర్త బాధ్యతల్ని తన బాధ్యతగా భావించి తోడుగా నిలబడే నీలాంటి వాళ్ళు ప్రేయర్ గా ఉంటారు నీలాంటి భార్య దొరకడం నిజంగానే అదృష్టం అంటాడు ఆర్య. మరోవైపు మీటింగ్ లో ఉన్న నీరజ్ మనం ఇంతకుముందు ఉన్న ప్రాజెక్టు గురించి మాట్లాడదాం అంటాడు.
అంతలోనే అక్కడికి వచ్చిన మాన్సీ నేను నీతో మాట్లాడాలి అంటుంది. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే కనిపించట్లేదా అంటూ కోప్పడతాడు మీరు ఇది అంతకంటే ఇంపార్టెంట్ అంటూ కన్స్ట్రక్షన్ ఫొటోస్ చూపిస్తుంది మాన్సీ. మీరందరూ కూడా ఒకసారి చూడండి అంటూ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ చూపిస్తుంది.
మనం అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అప్పగించిన కన్స్ట్రక్షన్ పిక్స్. ఇప్పటివరకు సగం పని కూడా పూర్తి కాలేదు వాళ్లకి ఇచ్చిన టైం కూడా పూర్తి కావస్తోంది. ఈ ప్రాజెక్టు ఇవ్వకుండా ఉండాల్సింది ఎప్పటికైనా నిలిచిపోయింది లేదు క్యాన్సిల్ చేద్దాం వీలైనంత తక్కువ నష్టంతో బయటపడదాం అంటుంది మాన్సీ. అక్కడ ప్రాజెక్టు ఎవరి డీల్ చేస్తున్నారు తెలిసే మాట్లాడుతున్నావా అంటాడు నీరజ్.
తెలుసు కానీ అక్కడ వర్కర్స్ స్ట్రైక్, సైట్ ఇంజినీర్స్ ప్రాబ్లమ్స్ తో వర్క్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది తప్పితే ముందుకు పోవడం లేదు అందుకే త్వరగా డెసిషన్ తీసుకుందామంటున్నాను అంటుంది మాన్సీ. మాన్సీ మేడం చెప్పిన దాంట్లో తప్పేమీ కనిపించట్లేదు ప్రాజెక్టులో ప్రోగ్రెస్ ఏమీ కనిపించట్లేదు కాబట్టి వాళ్లకి నష్టపరిహారాన్ని విచ్చేసి ప్రాజెక్టుని వేరే వాళ్ళకి అప్పగిద్దాం అంటాడు మీటింగ్ లో ఉన్న వ్యక్తి.
అంత అవసరం లేదు ఆ కంపెనీ స్టాండర్డ్స్ మీద,వాల్యూస్ మీద ప్రజెంట్ ఆ కంపెనీ మేనేజింగ్ వెనక ఉన్న పవర్ మీద మాకు గట్టి నమ్మకం ఉంది ఈ ప్రాజెక్టు కచ్చితంగా తీరుతుంది అంటాడు జెండే. ఊహలతో కంపెనీని నడిపించకూడదు, ప్రాక్టికల్ గా ఆలోచించండి ఇంత తక్కువ టైంలో వాళ్ళు ప్రాజెక్టుని పూర్తి చేయలేరు అంటుంది మాన్సీ.
మాన్సీ ని మందలించి మనం ఆ కంపెనీకి అగ్రిమెంట్ ఇచ్చాము దాన్ని బ్రేక్ చేయడం కరెక్ట్ కాదు ఒక డేట్ ఫిక్స్ చేసాం కదా అంతవరకు వెయిట్ చేద్దాం ఆ తర్వాత చేయాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అంటాడు నీరజ్. ఇదే నా ఫైనల్ డెసిషన్ కెన్ యు ప్లీజ్ అంటూ ఆమెని బయటికి పొమ్మన్నట్లుగా చేయి చూపిస్తాడు నీరజ్. ఆమె వెళ్లిపోయిన తర్వాత అందరికీ సారి చెప్పి మీటింగ్ ని కంటిన్యూ చేస్తాడు నీరజ్. మరోవైపు ప్రీతి ఫోన్ చేసి కిడ్నాప్ అయినా అను సేఫ్ గా దొరికింది అంటూ బాడ్ న్యూస్ చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.