మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్.. సల్లూ బాయ్ తో రామ్ చరణ్ స్టెప్పులు.. సాంగ్ పూర్తి.. డిటేయిల్స్!

Published : Mar 07, 2023, 12:48 PM ISTUpdated : Mar 07, 2023, 12:57 PM IST
మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్.. సల్లూ బాయ్ తో రామ్ చరణ్ స్టెప్పులు.. సాంగ్ పూర్తి.. డిటేయిల్స్!

సారాంశం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అందింది. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాలో చెర్రీ కామియో అపియెర్స్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దానిపై అప్డేట్ అందింది.  

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అందింది. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాలో చెర్రీ కామియో అపియెర్స్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దానిపై అప్డేట్ అందింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా పెరగలేదు. దెబ్బకు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇక నార్త్ లోనూ రామ్ చరణ్ కు భారీ ఫేమ్ దక్కించుకున్నారు. హిందీ నుంచి కూడా అవకాశాలు అందుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం రామ్ చరణ్ బాలీవుడ్ బిగ్ స్టార్స్ చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ నెక్ట్స్ సినిమాలోనూ కామియో అపియరెన్స్ ఇవ్వబోతుండా అదిరిపోయే అప్డేట్ అందింది.  

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’ (Kisi ka Bhai Kisi Ki Jaan). తమళ చిత్రం ‘వీరమ్’కు రీమేక్ ఇది. ఫర్హద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ తో కూడిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తో సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. విక్టరీ వెంకటేశ్, పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తుండటంతో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇది అఫీషియల్ గా కన్ఫమ్ అయ్యింది. అయితే చరణ్ ఓ సాంగ్ ద్వారా అలరించబోతున్నట్టు తెలుస్తోంది. 

ఈచిత్రంలోని ఓసాంగ్ లో రామ్ చరణ్ స్పెషల్ అపియెరెన్స్ ఇస్తున్నారంట. ఇప్పటికే ఆ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లోనే పూర్తైనట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్దే తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నారంట. ఈపాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రామ్ చరణ్ ను ఈ బాలీవుడ్ చిత్రంలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్, రవి బర్రూర్సం గీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలోని ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు. మరోవైపు ‘ఆస్కార్’ ఈవెంట్ లో హాజరయ్యేందుకు అమెరికాలో సందడి చేస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం