
ఎపిసోడ్ ప్రారంభంలో వర్కర్స్ తో అంతా కరెక్ట్ గానే ఉంది కదా, ఇక కన్స్ట్రక్షన్ కోసం బాంబులని బ్లాస్ట్ చేయొచ్చు కదా చుట్టుపక్కలంతా ఒకసారి బయోగ్లాస్ లో చూడండి అంటాడు ఆర్య. ఎవరైనా ఉన్నారేమో అని అనగా ఒక అతను బయోగ్లాస్ లో అంతా చూస్తాడు అక్కడ ఎవరూ ఉండరు. సార్ ఇక్కడ ఎవరూ లేరు మనం పని మొదలు పెట్టొచ్చు అని అంటాడు.
ఇంతలో మాన్సీ ఆ కొండలు వెనకాతల నుంచి చూస్తూ బ్రో ఇన్ లా మీ చావుని మీరే కొనితెచ్చుకుంటున్నారు అని అనుకుంటుంది. బాంబ్స్ పేల్చడం మొదలుపెట్టిన వెంటనే అవి అనుకున్న దిక్కున కాకుండా మరో దిక్కున పేలుతాయి. మనం అటువైపు బాంబ్స్ పెట్టలేదు కదా మరి అటువైపు ఎందుకు పేలుతున్నాయి అని అనుకుంటారు. ఇంతలో అక్కడికి ఊర్లో తల్లులు అందరూ వచ్చి మా పిల్లలందరూ అక్కడే ఆడుకుంటున్నారు.
అందరూ తిరిగి వచ్చారు కానీ నా కొడుకు ఇంకా రాలేదు అక్కడే ఉండిపోయాడు మీరే అలాగైనా కాపాడండి సారు అని ఏడుస్తూ అంటుంది ఒక ఆవిడ. ఆర్య భయపడి వెంటనే ఆ బాంబులు మధ్యలోకి వెళ్లి ఆ పిల్లాడిని వెతుకుతాడు. ఆ పిల్లాడు ఒక మూలన ఏడుస్తూ కూర్చుంటాడు. ఆర్య బాంబులు మధ్యలోకి వెళ్తూ ఉండగా చుట్టుపక్కల బాంబులు పేలడంతో బ్రో ఇన్ లా ఏదో ఒక బాంబు మీ మీద పడి మీ చావు కన్ఫామ్ అని అనుకుంటుంది.
ఇంతలో అను అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అనగా జరిగిన విషయం అంతా చెప్తారు అక్కడున్న వాళ్ళు. ఆర్య సార్.. అనుకుంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అను.అక్కడ ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించినా సరే వినకుండా వెళ్తుంది. ఇంతలో ఆర్య చాలా దూరం తర్వాత ఆ బాబుని కనిపెట్టి ఎలాగోలా తప్పించుకొని ఆ బాబుని సురక్షితమైన చోటుకు తీసుకొని వస్తాడు.
అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ అప్పు అమ్మ కూడా బయలుదేరింది సార్ అని అనగా ఆర్య కంగారుపడి మళ్లీ అను కోసం వెతకడం మొదలుపెడతాడు. అప్పటికే అను ఆర్య కోసం వెతుకుతూ తన చుట్టుపక్కల బాంబులు పేలడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. బ్రో ఇన్ లా ఒకసారి తప్పించుకున్నారు ఈసారి భార్య కోసం వచ్చి మళ్ళీ ప్రమాదానికి గురవబోతున్నారు అని అనుకుంటుంది మాన్సీ.
ఇంతలో ఆర్య అనుకోసం వెతుకుతూ ఉండగా అను అనిపిస్తుంది. అనుని ఎత్తుకొని బాంబులు మధ్యలో నుంచి ఎలాగోలా కాపాడుతాడు ఆర్య. మరోవైపు నీరజ్ మాన్సీకి ఫోన్ చేసి ఎక్కడున్నావు మాన్సీ వర్క్ ఉందని తెలుసు కదా ఇలాంటి టైంలో బయటకు వెళ్తున్నావు ఎందుకు,వర్క్ ఆగిపోతుంది కదా అని అరుస్తాడు. వచ్చేస్తున్నాను ఇప్పుడే వెళ్ళాను అని మాన్సీ అంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఈ అవకాశం పోతే ఏంటి ఇంకొక అవకాశం ఉంటుంది కదా.
మీ ఇద్దరినీ ఎలాగైనా ఇంటికి రానివ్వకుండా పైకి పంపించే ప్లాన్ వేస్తాను అని అనుకుంటుంది మాన్సీ.మరోవైపు ఆర్య అనుని క్షేమంగా తీసుకొచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎంత లేపినా లేవడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు పెద్ద బిందెతో పాలు తెచ్చి ఆర్య ముఖం మీద వేస్తారు. అప్పుడు ఆర్య లేచి, అసలు బుద్ధుందా అను ఎందుకు అలా వచ్చేసావు నీ ప్రాణానికి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అని అడగగా మీ ప్రాణం కన్నా ఇది ఎక్కువ కాదు సార్ అని అంటుంది అను.
ఆ బుడ్డోడి ని కాపాడి మీరు మంచి పని చేశారు. మీరు చేసిన పుణ్యం మీకు, మీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా శ్రీ రామరక్షల ఉంటుంది అని చుట్టుపక్కన వాళ్ళందరూ అంటారు. తర్వాత అను వెళ్లి ఆర్యని గట్టిగా హత్తుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.