
చేసింది ఒక్క చిత్రం. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో క్లారిటీ రావాల్సి ఉంది. అంతలోనే మెగా డ్రీమ్స్. మెగా కలలు కంటోంది సాహసం శ్వాసగా సాగిపో చిత్రం హీరోయిన్ మంజిమ మోహన్. గౌతమ్ మీనన్ లో చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ హీరోయిన్ చిరంజీవితో నటించాలని కోరుకుంటుంది. తన మనసులోని కోరికను బయటపెట్టింది మంజిమ.
ఫ్యూచర్ లో మెగాస్టార్ సరసన నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్ననాని చెప్పుకొచ్చింది. చిరంజీవి తో నటించాలి అని మంజిమ చెప్పడం వెనుక పెద్ద స్కెచ్ కనిపిస్తోంది.ఆ విధంగా మెగా కాంపౌండ్ కి దగ్గరైతే.. చెర్రీ,బన్నీ, చైతూ, వరుణ్ లతో సినిమాలుచేసే అవకాశం దక్కించుకోవచ్చు అనే కొత్త హీరోయిన్ ఆలోచనగా కనిపిస్తోంది అందుకే డైరెక్ట్ గా మెగాస్టార్ తో సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తమిళంలో మరో రెండు ప్రాజెక్టులు చేస్తోంది మంజిమ.తెలుగులో మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. బొద్దుగా ఉండటంతో..టీటౌన్ దర్శకనిర్మాతలు ఈ అమ్మడిని తీసుకొవడానికి ఆలోచిస్తున్నారట.అయితే సాహసం శ్వాసగా సాగిపో లో ఆమె పర్ఫామెన్స్ పై మాత్రం ఫిదా అయ్యారు. ఫ్యూచర్ లో మంజిమ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.