విడాకుల గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించిన మనీషా కోయిరాలా.. పెళ్లి ఒక పెద్ద పొరపాటు అంటూ వ్యాఖ్యలు..

Published : Apr 02, 2023, 04:47 PM ISTUpdated : Apr 02, 2023, 04:48 PM IST
విడాకుల గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించిన మనీషా కోయిరాలా.. పెళ్లి ఒక పెద్ద పొరపాటు అంటూ వ్యాఖ్యలు..

సారాంశం

అలనాటి అందాల తార మనీషా కోయిరాలా ఇప్పుడు యాక్టివ్‌ అవుతుంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ భామ తన పెళ్లి లైఫ్‌ గురించి ఓపెన్‌ అయ్యింది. 

`నెల్లూరి నెరజాణ` అంటూ తెలుగు ఆడియెన్సే కాదు, సౌత్‌ని ఊపేసింది మనీషా కోయిరాలా. 1990నాటి కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్. ఒకప్పుడు అందాల తారగా పాపులర్‌ అయిన మనీషా కోయిరాలా జీవితంలో అనేక స్ట్రగుల్స్ ఉన్నాయి. ఓ వైపు వైవాహిక జీవితం నిలబడలేకపోవడం, మరోవైపు క్యాన్సర్‌ బారిన పడటంతో ఈ బ్యూటీకి దెబ్బ మీ దెబ్బ పడినట్టు అయ్యింది. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి నిలబడింది. మళ్లీ నటిగా బిజీ అయ్యింది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. 

తాజాగా తన వైవివాహిక జీవితానికి సంబంధించి మనీషా కోయిరాలా స్పందించింది. నేపాల్‌కి చెందిన మనీషా కోయిరాలా ఆ దేశానికి చెందిన వ్యాపార వేత్త సమ్రాట్‌ దహల్‌ని వివాహం చేసుకుంది. 2010లో వివాహం జరగ్గా ఆరు నెలలకే విభేదాలు ప్రారంభమయ్యాయట. గొడవల నేపథ్యంలో దాదాపు ఏడాది పాటు పోరాడి ఆమె విడాకులు తీసుకుంది. 2012లో తన భర్త సమ్రాట్‌ దహల్‌తో విడిపోయింది మనీషా. 

అయితే తాజాగా ఆమె తన వైవాహిక జీవితంపై ఓపెన్‌ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని, ఎంత ట్రై చేసినా ప్రయోజనం లేదని, తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడని, దీంతో విడాకులు తీసుకున్నట్టు చెప్పింది. అయితే విడిపోవడానికి తానే కారణమని, అందులో తన భర్త తప్పేమి లేదని ఆమె గతంలో చెప్పింది. విడుదలకు ఆలోచన కూడా తనదే అని, పెళ్లి చేసుకుని తాన తప్పు చేశానని వెల్లడించింది.

 ఇంకా చెబుతూ, `పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నా. అది ఎప్పటికీ నెరవేరలేదు. అవి కలలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి సమస్య ఎవరికీ రాకూడదు. నేను మాత్రమే కాదు, వైవాహిక బంధంలో సంతోషంగా లేకుండా విడిపోవడమే ఏకైక ఎంపిక` అని తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో కలిసి నటించిన `బాబా` సినిమా పరాజయంతో సౌత్‌లో తన పనిఅయిపోయిందని ఆ తర్వాత ఆఫర్లు రాలేదని చెప్పి షాకిచ్చింది. ఇక తెలుగులో `క్రిమినల్‌` చిత్రంలో నటించింది మనీషా కోయిరాలా. కానీ తమిళంలో నాలుగైదు సినిమాల్లో నటించింది. 

మనీషా కొయిరాలాను అలనాటి నటి నర్గీస్‌తో పోలుస్తారు. సౌత్‌లో `బాంబే’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె 1991లో `సౌదాగర్` సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత `బాంబే` సినిమాతో జనాల హృదయాల్లో భిన్నమైన ముద్ర వేసింది. వీటితోపాటు `1942: ఎ లవ్ స్టోరీ`, `అగ్ని సాక్షి`, `గుప్తా`, `మన్` వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల కాలంలో మనీషా హిందీలో `డియర్‌ మాయా`, `లస్ట్ స్టోరీస్‌`, `సంజు`, `ప్రస్థానం`, `మాస్కా`, `షేహజాడా` వంటి చిత్రాల్లో నటించింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ