హాలీవుడ్ నటికి ముద్దుపెట్టిన వరుణ్ ధావన్.. తీవ్ర విమర్శలు.. తట్టుకోలేక స్పందించిన బాలీవుడ్ స్టార్..

By Asianet News  |  First Published Apr 2, 2023, 4:39 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ చేసిన పనికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న ముంబలోని ఈవెంట్ లో వరుణ్ ధావన్ హాలీవుడ్ నటిని ముద్దుపెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా ఆయన స్పందిస్తూ క్లారిటీ  ఇచ్చారు.
 


బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు. చివరిగా ‘తోడేలు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నారు. కాగా, తాజాగా వరుణ్ ధావన్ చేసిన పనికి  నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ హాలీవుడ్ నటితో ఆయన ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు. అయితే, ప్రస్తుతం ముంబైలో కొనసాగుతున్న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.  

ఈ ఈవెంట్ కు బాలీవుడ్, సౌత్ నుంచి కూడా ముఖ్యమైన సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. ముఖేష్ అంబానీ ప్రముఖ భారతీయ దిగ్గజ వ్యాపార వేత్త కావడంతో హాలీవుడ్ నటులు కూడా హాజరయ్యారు. టామ్ హాలండ్, జెండయా, పెనెలోప్ క్రూజ్ లతో పాటు హాలీవుడ్ సూపర్ మోడల్ జిగి హడిడ్ (Gigi Hadid) హాజరయ్యారు. ఈవెంట్ లో ఆమె భారతీయ సంప్రదాయ దుస్తుల్లోనే మెరిశారు. ఈక్రమంలో స్టేజీపై వరుణ్ ధావన్ డాన్స్ తో ఆకట్టుకున్నారు. అదే సమయంలో జిగిని స్టేజీ  పైకి పిలిచాడు.  ఆమెను అమాంతం ఎత్తుకొని చుట్టూ ఓ రౌండ్ తిరిగి కిందకు దింపే క్రమంలో ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. దీంతో సదరు మోడల్ అసౌకర్యంగా ఫీల్ అయ్యింది. ఈవెంట్ లోనూ యాక్టివ్ గా ఉండలేకపోయిందని తెలుస్తోంది.

Latest Videos

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. హాలీవుడ్ నుంచి మన ఆహ్వానం మేరకు వచ్చిన వారితో ఇలా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు మండిపడ్డారు. వరుణ్ ధావన్ తీరును తప్పుబట్టారు. ఇలాంటి పనుల వల్లే ఇండస్ట్రీ పేరు చెడిపోతుందని విమర్శలు గుప్పించారు. ఈ వీడియో నిన్నటి నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతూ వరుణ్ దాకా చేరింది. వెంటనే స్పందిస్తూ ఆ ఇష్యూపై స్పందించారు. ఇదంతా ముందే ప్లాన్ చేసుకున్నాదని క్లారిటీ  ఇచ్చారు. 

 

ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ట్వీట్ కు రిప్లై ఇస్తూ ఇష్యూ పై ఇలా స్పందించారు. ‘ఈ రోజు మీరు నన్ను ఇలాగే మేల్కోపుతారని ఊహించాను. అందుకే వివరణ ఇస్తున్నాను. కేవలం ఆమెను స్టేజీ పైకి తీసుకొచ్చేందుకు ఇలా ప్లాన్ చేసిందే.’ అంటూ క్లారిటీ  ఇచ్చారు. మొత్తానికి త్వరగా వరుణ్ దీనిపై స్పందించడంతో అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు. ఫలితంగా ట్రోల్స్, విమర్శలకు అడ్డుకట్ట పడంది. ఇక వరుణ్ ధావన్ - జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం Bawaal. అక్టోబర్ 6న విడుదల కాబోతోంది. 

I guess today you woke up and decided to be woke. So lemme burst ur bubble and tell u it was planned for her to be on stage so find a new Twitter cause to vent about rather then going out and doing something about things . Good morning 🙏 https://t.co/9O7Hg43y0S

— VarunDhawan (@Varun_dvn)
click me!