
నటుడు మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. హౌస్ ఆఫ్ మంచూస్ పేరుతో రియాలిటీ షో చేస్తున్నామంటూ ప్రోమో విడుదల చేశారు. సదరు ప్రోమో మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో కూడి ఉంది. అంటే... మనోజ్ తో నాకు ఎలాంటి విబేధాలు లేవు. ఇదంతా ఓ రియాలిటీ షోలో భాగం. మనోజ్ పోస్ట్ చేసిన వీడియో ఒక ఫ్రాంక్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. జనాలకు మాత్రం ఎక్కడో అనుమానం ఉంది. పరువు నిలబెట్టుకునేందుకు రియాలిటీ షో తెరపైకి తెచ్చారన్న ప్రచారం ఉంది.
దాన్ని రుజువు చేస్తూ మనోజ్, మంచు లక్ష్మి వ్యాఖ్యలు ఉన్నాయి. మంచు లక్ష్మిని హౌస్ ఆఫ్ మంచూస్ షో గురించి అడగ్గా... నాకు ఐడియా లేదు అన్నారట. అలాగే మాకు ఎలాంటి సంబంధం లేదన్నారట. ఇక మనోజ్ టీమ్ కూడా దీన్ని ఖండించారట. మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రియల్ అన్నారట.
మోహన్ బాబు సన్నిహితుడైన సారథి ఇంటికి పోయి విష్ణు గొడవపడ్డాడు. ఆ విషయం సారథి భార్య మనోజ్ కి ఫోన్ చేసి చెప్పింది. అప్పుడు మనోజ్ అక్కడకు వెళ్లాడని మనోజ్ టీమ్ వెల్లడించారట. అంటే మనోజ్ పోస్ట్ చేసిన వీడియో ఫ్రాంక్ కాదని తెలుస్తుంది. అదే సమయంలో 'హౌస్ ఆఫ్ మంచూస్' రియాలిటీ షో గురించి తమకు తెలియదని లక్ష్మి, మనోజ్ అన్నారట.
ఈ పరిణామాల నేపథ్యంలో హౌస్ ఆఫ్ మంచూస్ ఒక డమ్మీ షో అని, ఇది విష్ణు చేసిన బూటకపు ప్రకటన అని తేలిపోయింది. దీంతో అసలు విష్ణు ప్రకటించిన షో ఉంటుందా? లేదా? అండ్ సందేహాలు తెరపైకి వచ్చాయి.పరువు నిలబెట్టుకోసం విష్ణు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు కూడా పరోక్షంగా గొడవలు నిజమే అన్నారు.