రూ. కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టిన తాప్సీ , అనురాగ్ కశ్యప్‌: ఐటీ శాఖ దర్యాప్తులో కీలక విషయాలు

By Siva KodatiFirst Published Mar 4, 2021, 9:54 PM IST
Highlights

బాలీవుడ్‌లో ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ సోదాలపై సీబీడీటీ ప్రకటన విడుదల చేసింది. తాప్సీ, అనురాగ్ కశ్యప్‌లతో పాటు ఫాంటమ్ ఫిల్మ్స్, టాలెంట్ హంట్ సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు వెల్లడించింది

బాలీవుడ్‌లో ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ సోదాలపై సీబీడీటీ ప్రకటన విడుదల చేసింది. తాప్సీ, అనురాగ్ కశ్యప్‌లతో పాటు ఫాంటమ్ ఫిల్మ్స్, టాలెంట్ హంట్ సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

హీరోయిన్ తాప్సీ దగ్గర లెక్కల్లో చూపని రూ.5 కోట్ల నగదుకు సంబంధించి ఆధారాలు లభించినట్లు సీబీడీటీ చెప్పింది. ఇక అనురాగ్ కశ్యప్ రూ.20 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిపింది.

దీంతో బాలీవుడ్ ఐటీ రైడ్స్ వ్యవహారం ముదురుతోంది. తాప్సీకి చెందిన కంపెనీ కూడా పన్నులు ఎగవేసినట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. దీంతో ఆమె యాడ్ ఎండార్స్‌మెంట్, సినిమా ఒప్పందాలను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఇందులో కొన్ని ఒప్పందాలు కోట్లలో వున్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను తాప్సీ తన ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు గుర్తించారు. దీనిని తిరిగి రిస్టోర్ చేసేందుకు నిపుణుల సాయం తీసుకుంటోంది ఐటీ శాఖ.

అయితే మరోసారి తాప్సీని విచారించేందుకు రెడీ అవుతోంది ఆదాయపు పన్ను శాఖ. ఇక ఫాంటమ్ ఫిల్మ్స్ వ్యవహారాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల పన్నులు ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు.

ఫాంటమ్ ఫిల్మ్స్‌లో వాటాను అమ్ముకున్న కొందరు ట్యాక్స్‌లు కట్టలేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. భోగస్ ఖర్చులు, ఫేక్ బిల్లులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కొన్ని సినిమాల వాస్తవ బాక్సాఫీస్ కలెక్షన్లకు , లెక్కల్లో చూపిన కలెక్షన్లకు తేడా వున్నట్లు గుర్తించారు. 

click me!