జిమ్‌లో రేర్‌ బెంచ్‌ మార్క్ చేరుకున్న అల్లు శిరీష్‌.. వీడియో వైరల్‌

Published : Mar 04, 2021, 07:25 PM IST
జిమ్‌లో రేర్‌ బెంచ్‌ మార్క్ చేరుకున్న అల్లు శిరీష్‌.. వీడియో వైరల్‌

సారాంశం

అల్లు శిరీష్‌ ఇటీవల బాగా బరువు తగ్గాడు. వెయిట్‌ లాస్‌ సీక్రెట్‌ ఏంటో తెలిసిపోయింది. ఆయన జిమ్‌లో ఏ రేంజ్‌లో కష్టపడుతున్నాడో తెలిసిపోయింది. తాజాగా శిరీష్‌ వంద కేజీల బెంచ్‌మార్క్ కి చేరుకున్నాడు. వంద కేజీల వెయిట్‌తో ఆయన చెస్ట్ ఎక్సర్‌ సైజ్‌లు చేశారు. 

స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోదరుడు, హీరో అల్లు శిరీష్‌ జిమ్‌లో చేమటోడుస్తున్నాడు. గతంలో కంటే మరింతగా బరువు తగ్గి కాస్త స్లిమ్‌గా మారుతున్నారు. నిత్యం వర్కౌట్‌ చేస్తూ తనని తాను ఫిట్‌గా మార్చుకుంటున్నాడు. అదే సమయంలో నటుడిగా సరికొత్తగా మారబోతున్నాడు. అల్లు శిరీష్‌ ఇటీవల బాగా బరువు తగ్గాడు. వెయిట్‌ లాస్‌ సీక్రెట్‌ ఏంటో తెలిసిపోయింది. ఆయన జిమ్‌లో ఏ రేంజ్‌లో కష్టపడుతున్నాడో తెలిసిపోయింది. తాజాగా శిరీష్‌ వంద కేజీల బెంచ్‌మార్క్ కి చేరుకున్నాడు. వంద కేజీల వెయిట్‌తో ఆయన చెస్ట్ ఎక్సర్‌ సైజ్‌లు చేశారు. 

`జిమ్‌లో కొత్తగా పర్సనల్‌ బెంచ్‌ మార్క్ ని తాకినందుకు చాలా సంతోషంగా ఉంది. ఛాతీ ప్రెస్‌ మెషిన్‌లో వంద కేజీలు. నా ఫిట్‌నెస్‌ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దూరం వెళ్లాలి` అని పేర్కొన్నాడు శిరీష్‌. ఇటీవల ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులోనూ కాస్త బరువు తగ్గి కనిపిస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య ఆయన పాల్గొన్న `లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి` చిత్ర ప్రెస్‌మీట్‌లోనూ స్లిమ్‌గా కనిపించారు. సినిమాల కోసం ఆయన బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. 

శిరీష్‌ చివరగా `ఏబీసీడీ`లో నటించారు. ఇది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో ఎలాగైనా ఈ సారి హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాకేష్‌ శశి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఆ చిత్రం రూపొందుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో లవర్‌ బాయ్‌గా కనిపించేందుకు శిరీష్‌ ఇంతగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సారైనా హిట్‌ కొడతాడేమో చూడాలి. కానీ ప్రస్తుతం ఆయన పంచుకున్న జిమ్‌ వీడియో వైరల్‌ అవుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?