
ఎనర్జటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్ హైదరాబాదీ` ట్యాగ్ టైన్. రీసెంట్‌గా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటోంది. అందులో భాగంగా గోవాలో రామ్ నభా నటేశ్‌లపై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.
భాను మాస్టర్ నృత్య రీతులను సమకూరుస్తున్నారు. రామ్ జోడిగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రేపు విడుదల చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాలో మణిశర్మ నేపథ్య సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని టాక్.
పూరి జగన్నాథ్ - మణిశర్మ కాంబినేషన్ లో ఇంతకుముందు పోకిరి - చిరుత - ఏక్ నిరంజన్ - కెమెరా మెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు తెరకెక్కాయి. టెంపర్ సినిమాకు కూడా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మొత్తంగా ఈ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ రాబోతోంది. మరి ఈ సినిమా ఎంతవరకు హిట్టవుతోందో చూడాలి.