సైరాలో అనుష్క రోల్ ఇదే!

Published : May 14, 2019, 06:05 PM IST
సైరాలో అనుష్క రోల్ ఇదే!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనీ దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఎప్పటికప్పుడు సినిమా పనులపై ఆరా తీస్తున్నాడు. 

ఆ సంగతి అటుంచితే.. ఇప్పుడు సినిమాలో అనుష్క రోల్ పై కొత్త విషయం తెలిసింది. అమ్మడు కీలక పాత్రలో నటించనుందని గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ కీలక పాత్ర ఏమిటా అని ఆరా తీస్తే.. సినిమా కథ మొదలయ్యేది అనుష్కతోనే అని తెలిసింది. ఆమె ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథను చెబుతూ ప్రత్యేక యాంకర్ పాత్రను పోషించనున్నారు. 

ఆమె మాటలతో కథను మొదలుపెట్టే విధానం సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. మరికొన్ని రోజుల్లో దర్శకుడు సురేందర్ రెడ్డి అనుష్క పాత్రకు సంబందించిన సీన్స్ ను ఫినిష్ చేయనున్నాడని సమాచారం.  

PREV
click me!

Recommended Stories

Nora Fatehi Bindaas Song: అప్పుడు తమన్నా, ఇప్పుడు నోరా.. ఒక్క దెబ్బకు రజినీ సినిమాకు హైప్
October OTT Releases: అక్టోబర్ ఓటీటీ ధమాకా.. విడుదలయ్యే టాప్ సినిమాలు, సిరీస్‌‌లు ఇవే