Bigg Boss5ః బతుకమ్మ టూ సారంగ దరియా టూ రాములో రాములా.. మంగ్లీ పాటల ప్రవాహం.. మూడు అవార్డులు కొట్టేసిన ప్రియా

Published : Oct 10, 2021, 08:32 PM IST
Bigg Boss5ః బతుకమ్మ టూ సారంగ దరియా టూ రాములో రాములా.. మంగ్లీ పాటల ప్రవాహం.. మూడు అవార్డులు కొట్టేసిన ప్రియా

సారాంశం

బతుకమ్మ పాటతో స్టార్ట్ చేసిన మంగ్లీ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎనిమిది తొమ్మిది పాటలతో చూపుతిప్పుకోకుండా చేసింది. బ్రేక్‌ లేకుండా తన అద్భుతమైన గాత్రంతో అబ్బురపరిచింది. బిగ్‌బాస్‌ షోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 

ఓ వైపు `మా` ఎన్నికల వేడి, ఉత్కంఠ, మరోవైపు బిగ్‌బాస్‌5 షోకి చెందిన నవరాత్రి స్పెషల్‌ ప్రోగ్రామ్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. టీవీ ఆడియెన్స్ కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌నిస్తుంది. బిగ్‌బాస్‌5 నవరాత్రి స్పెషల్‌లో భాగంగా సింగర్‌ మంగ్లీ దుమ్ములేపింది. వరుసగా పాటల ప్రవాహంతో ఒలలాడించింది. ఉర్రూతలూగించింది. బతుకమ్మ పాటతో స్టార్ట్ చేసిన ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎనిమిది తొమ్మిది పాటలతో చూపుతిప్పుకోకుండా చేసింది mangli. బ్రేక్‌ లేకుండా తన అద్భుతమైన గాత్రంతో అబ్బురపరిచింది. బిగ్‌బాస్‌ షోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 

బతుకమ్మ పాట, జ్వాలా రెడ్డి, జానపద పాట, సినిమా మాస్‌ సాంగ్‌, భూమ్‌ బదల్‌ పాట, సరబెల్లే, రాములో రాములు.. సారంగ దరియా పాటలతో మెప్పించింది. ఆడియెన్స్ కి మంచి రిలీఫ్‌నిచ్చింది. మరోవైపు ఈ లోపు ఇంటి సభ్యులు బతుకమ్మలు ప్రిపేర్‌చేశారు. రవి టీమ్‌, ప్రియా టీమ్‌లు చేరో ఒకటి బతుకమ్మ చేశారు. రవి టీమ్‌ నుంచి ప్రియాంక, ప్రియా టీమ్‌ నుంచి ప్రియా బతుకమ్మ చేశారు. ఈ బతుకమ్మలు చూసిన మంగ్లీ ప్రియా టీమ్‌ చేసిన బతుకమ్మ బాగా ఉందని ఆమె టీమ్‌ని విన్నర్‌గా నిలిపారు.

also read: MAA Elections: రాజకీయ లబ్ధి కోసం అలా చేస్తున్నారు.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

ప్రియాంక, స్వేత, ప్రియా, అనీ మాస్టర్‌, సిరి, హమీద, కాజల్‌ కలిసి బతుకమ్మ పాటకి డాన్స్ వేశారు. అందులో బెస్ట్ చెప్పింది మంగ్లీ. మరోవైపు ఈ గేమ్‌లో ప్రియా టీమ్‌ గెలవడంతో కాజల్‌ వీడియోని చూపించారు. కాజల్‌ ఫ్యామిలీ నుంచి ఆమె కూతురు మాట్లాడారు. ఫైనల్లీ bigg boss5లోకి వెళ్లావని, చాలా సంతోషంగా ఉందని తెలిపింది. అమ్మని చాలా మిస్‌ అవుతున్నానని, ఫైనల్‌గా గేమ్‌పై ఫోకస్‌ పెట్టి, విన్నర్‌గా నిలవాలని తెలిపింది. దీంతో కాజల్‌ ఎమోషనల్‌ అయ్యింది. ఇప్పటి వరకు రవి టీమ్‌, ప్రియా టీమ్‌ల్లో మూడు సార్లు గెలుచుకుని అవార్డులను గెలుచుకుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?