Maa Elections : చేయి కొరికిన హేమ.... శివబాలాజీకి నిమ్స్‌లో చికిత్స

By Siva KodatiFirst Published Oct 10, 2021, 8:22 PM IST
Highlights

హైదరాబాద్ నిమ్స్‌లో నటుడు శివబాలాజీకి చికిత్స జరిగింది. ఉదయం సినీ నటి హేమ ఆయన చేయికొరికింది. దీంతో శివబాలాజీకి గాయమైంది. అనంతరం కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన నేరుగా పంజాగుట్ట నిమ్స్‌కు చేరుకుని చికిత్స పొందారు

హైదరాబాద్ నిమ్స్‌లో నటుడు శివబాలాజీకి చికిత్స జరిగింది. ఉదయం సినీ నటి హేమ ఆయన చేయికొరికింది. దీంతో శివబాలాజీకి గాయమైంది. అనంతరం కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన నేరుగా పంజాగుట్ట నిమ్స్‌కు చేరుకుని చికిత్స పొందారు. పోలింగ్ కేంద్రంలో హేమ (hema) తన చేయి కొరికింది అని శివ బాలాజీ (shiva balaji) కంప్లైంట్ చేయడం సంచలనంగా మారింది. నరేశ్ తో పాటు మీడియా ముందుకు వచ్చిన శివ బాలాజీ.. హేమ నోటితో చేతిని కొరకారని గాయం చూపించడం జరిగింది. ఈ విషయం మీడియాలో హైలైట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో హేమ వివరణ ఇచ్చారు. 

తాను పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టారని.. తప్పుకోమంటే తప్పుకోలేదని హేమ చెప్పారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో  చేయి కొరకాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అంతే తప్ప దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. మంచు విష్ణు ప్యానెల్ నుండి శివబాలాజీ ట్రెజరర్ గా పోటీ చేస్తుండగా, ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి హేమ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీపడుతున్నారు. ఎన్నికలు మొదలైన నాటి నుండి నటి హేమ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పై అనేక ఆరోపణలు చేశారు. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ముగిసింది. 665 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి వీటి సంఖ్య 700 దాటే అవకాశం వుందని సమాచారం. గతంలోనే ఎన్నడూ లేని విధంగా 83 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 

ALso Read: MAA elections: అందుకే శివబాలాజీ చేయి కొరికినాను, దురుద్దేశం ఏమీ లేదు... నటి హేమ వివరణ

అంతకుముందు  ఊహించిన దాని కంటే ఎక్కువగా సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తడంతో ముందుగా ఇచ్చిన పోలింగ్ గడువు సరిపోదని మా ఎన్నికల అధికారులు నిర్థారించారు. దీంతో మా అధ్యక్ష అభ్యర్ధులు ప్రకాశ్ రాజ్ (prakash raj), మంచు విష్ణులతో (manchu vishnu) చర్చించిన ఎన్నికల అధికారులు పోలింగ్ సమయం మరో గంట పెంచాలని నిర్ణయించారు. దీంతో మా ఎన్నికల పోలింగ్ 3 గంటల వరకు జరిగింది. క్యూలైన్‌లో వున్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోటీలో నిలిచిన ఇరు ప్యానెల్స్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ ప్యానెల్ విజయం సాధిస్తుంది అంటూ.. ధీమాగా చెబుతున్నారు. ఇంత హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో విజేత ఎవరనేది మరి కొన్ని గంటలలో తేలిపోనుంది. 

click me!