MAA elections:ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య ముచ్చట్లు

Published : Oct 10, 2021, 08:10 PM IST
MAA elections:ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య ముచ్చట్లు

సారాంశం

ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఓ చోటి చేరి మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు బద్ద శత్రువులుగా తిట్టుకున్న ఇద్దరూ... ఫలితాల వచ్చే సమయంలో ఏమి మాట్లాడుకుంటున్నారని అందరూ ఆలోచిస్తున్నారు. 


ఒకపక్క ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన అనసూయ, సురేష్ కొండేటి, శివారెడ్డి, కౌశిక్ గెలినట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటన చేయకున్నప్పటికీ.. వీరి నలుగురు గెలుపు ఖాయమయ్యింది. ఇక మంచు విష్ణు ప్యానెల్ నుండి కూడా కొందరు గెలిచినట్లు తెలుస్తుంది. దాదాపు 10 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మంచు విష్ణు ప్యానెల్ నుండి గెలిచినట్లు సమాచారం. 

కాగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఓ చోటి చేరి మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు బద్ద శత్రువులుగా తిట్టుకున్న ఇద్దరూ... ఫలితాల వచ్చే సమయంలో ఏమి మాట్లాడుకుంటున్నారని అందరూ ఆలోచిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా ఇరు ప్యానెల్ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎలెక్షన్ సెంటర్ లో ప్రచారం చూస్తున్నారంటూ మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 


ఈ విషయంలో ఇరు ప్యానెల్ సభ్యుల మధ్య గొడవ చోటు చేసుకుంది. నటి హేమ ఏకంగా శివ బాలాజీ చేయి కొరికారు. తన దారిని అడ్డుకున్న బాలాజీ చేయిని కొరకాల్సి వచ్చిందని, అంతకు మినహా మరో ఆలోచన లేదన్నారు.  మొత్తంగా ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. మంచు విష్ణుకు మద్దతుదారుడిగా ఉన్న నరేష్ మాత్రం విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ఓట్లు కౌంటింగ్ మొదలైంది. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth : 25 ఏళ్ల పాటు జపాన్ లో రికార్డు క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ హీరో
Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద