మంచు విష్ణు - మంచు మనోజ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ ఇప్పటికే పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా తారాస్థాయికి చేరుకుంది. ఏకంగా మంచు విష్ణు మనోజ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ మారింది.
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) అంటే ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఆయన కొడుకులైన మంచు విష్ణు, మంచు మనోజ్ పట్ల కూడా అంతే అభిమానం చూపిస్తుంటారు. అయితే ఎప్పుడూ ఎలాంటి ఘర్షణలు లేని మంచు ఫ్యామిలీలో కొంతకాలంగా విబేధాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా Manchu Vishnu మరియు Manchu Manoj మధ్య మనస్ఫార్థాలు తారా స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరి మధ్య వైర్యం మొదలైందని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. మంటలేనిదే పొగ రాదనట్టుగా ఆయా సందర్భాలు వీరి మధ్య ఘర్షణలను సూచిస్తున్నాయి.
ఇక తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏకంగా మంచు విష్ణు తమ్ముడు మనోజ్ పై దాడికి పాల్పడ్డారు. విష్ణు బంధువుల ఇంట్లోకి వెళ్లి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏ విషయంలో మంచు విష్ణు ఇలా ప్రవర్తించాడో క్లారిటీ లేదు. కానీ విష్ణు, మనోజ్ మధ్య విబేధాలు తారా స్థాయికి వెళ్లాయని ఈ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. వీడియోలో.. మనోజ్ తమ్ముడి మనోజ్ పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. తమ బంధువుల ఇంట్లో ఉండగా.. ఇంట్లోకి వెళ్లి మరీ మనోజ్ కు వార్నింగ్ ఇచ్చినట్టు గా వీడియో ద్వారా స్పష్టం అవుతోంది.
ఈ వీడియోతో వివాదం కాస్తా బయట పడింది. ‘మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుండగా.... ఇదీ ఇలాగా ఇండ్లలోకి వచ్చి మావాళ్లను, బంధువులను కొడుతుంటారండీ, ఇది సిట్యూయేషన్’ అంటూ మనోజ్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రీసెంట్ గా మంచు మనోజ్ - మౌనికా రెడ్డి వివాహానికి కూడా మంచు విష్ణు ఇలా వచ్చిఅలా వెళ్లిపోవడం.. అలాగే విష్ణు పుట్టినరోజుకు మనోజ్ విష్ చేసిన రిప్లై ఇవ్వకపోవడం వంటి సందర్భాలు వీరిమధ్య విబేధాలను తెలియజేస్తున్నాయి. అయితే సారధి అనే వ్యక్తి ఇంట్లో ఉండగా విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మంచు మనోజ్ బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయబోతున్నట్టు కూడా సమాచారం.
మంచు మనోజ్ - విష్ణు మధ్య ఎప్పటి నుంచో ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా రోడ్డునపడ్డాయి. దీనికి కారణం ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మంచు విష్ణు తమ కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని, భూమా మౌనికా రెడ్డికి దగ్గరడం వల్లే విబేధాలు ప్రారంభమయ్యాయని ప్రచారం జరుగుతోంది. నిజానికి మంచు విష్ణు సైతం వీరి పెళ్లిలో ఎక్కువగా సందడి చేయలేదు. కనీసం ఫొటోలో కూడా ఎక్కడా దిగినట్టు కనిపించలేదు. ఇక విష్ణు కూడా వీరి పెళ్లి తర్వాత పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ప్రస్తుతం ఇలా ఏకంగా దాడికి పాల్పడినటు వంటి వీడియో నెట్టింట వచ్చి చేరడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ వివాదంపై మంచు మోహన్ బాబు స్పందించలేదు. మున్ముందు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
What the f**k is going on for brothers pic.twitter.com/k5Y7BmxPs7
— Tangella karthik (@tangella_rama)