“బలగం” హఠాత్తుగా OTT లోకి..షాకింగ్ రీజన్ !

By Surya PrakashFirst Published Mar 24, 2023, 10:53 AM IST
Highlights

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో  జరిగే కథగా నిర్మితమైన ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, యాస, గోస, కట్టుబాట్లు.. ఇలా సమస్తం ఈ సినిమాలో కనిపిస్తాయి. 


ప్రియదర్శి ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మించిన బలగం సినిమా మార్చ్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో  జరిగే కథగా నిర్మితమైన ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, యాస, గోస, కట్టుబాట్లు.. ఇలా సమస్తం ఈ సినిమాలో కనిపిస్తాయి.  ఈ చిత్రంలో పెద్ద తారలు లేకపోయినప్పటికీ దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ కావటంతో ఈ సినిమాకి తగిన స్థాయిలో ప్రచారం లభించింది. ఇప్పుడీ చిత్రం ఓటిటిలో ప్రయాణం పెట్టుకుంది. 

ఈ రోజు నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఓ సాలిడ్ రేటుకి దక్కించుకుంది.  ఈ మూవీ ఓటిటిలో  తెలుగు, తమిళ, మలయాళ భాషల ఆడియన్స్ కి అందుబాటులోకి రావడం జరిగింది. అయితే ఓవైపు థియేటర్స్ లో మంచి కలెక్షన్ రాబడుతున్న ఈ మూవీ హఠాత్తుగా ఓటిటి లోకి రిలీజ్ అవడం సర్ప్రైజ్ అనే చెప్పాలి. అయితే ముందుగా అనుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం ఓటిటి స్ట్రీమింగ్ మొదలైందని తెలుస్తోంది. 

భారత్ తప్ప ప్రపంచంలో మిగతా అన్ని దేశాల్లో హక్కుల్ని  సింప్లీ సౌత్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది.   వాళ్లు అధికారికంగా మార్చి 24 నుంచి ఓటీటీలో తీసుకొస్తున్నామని ప్రకటించారు.  దాంతో అమేజాన్  ప్రైమ్ ...తమ మార్కెట్ కు దెబ్బతగలకుండా  వెంటనే తమ ఓటిటిలోకి  ఈ సినిమాని స్ట్రీమింగ్ మొదలెట్టేసిందని సమాచారం.

అలాగే ఈ చిత్రంలో తెలంగాణ పల్లెటూరి జీవితంలో అంతర్భాగమైన జానపదాలను, సంగీతాన్ని, బుర్రకథలను, ఇతర పల్లె కళారూపాలను అద్భుతంగా అవసరం మేరకు వాడుకున్న తీరు బాగుంది.  ఈ సినిమా రిలీజ్ అయిన 19 రోజుల్లో ఏకంగా రూ.19 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్‌ను అందించింది. థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌కు ఏ మేరకు  ఆదరణ పొందుతుందో చూడాలి. 
 

click me!