26/11 Mumbai attacks: సందీప్ ఉన్నికృష్ణన్ కి హీరో అడివి శేష్ నివాళి

pratap reddy   | Asianet News
Published : Nov 26, 2021, 02:57 PM IST
26/11 Mumbai attacks: సందీప్ ఉన్నికృష్ణన్ కి హీరో అడివి శేష్ నివాళి

సారాంశం

26/11 ముంబై దాడులు, సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర నేపథ్యంలో శశి కిరణ్ తిక్క 'మేజర్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

26/11 ముంబై దాడుల ఘటన దేశ చరిత్రలో నెత్తుటి మరకగా మిగిలిపోయింది. వందలాది మంది అమాయకుల ప్రాణాలని ఉగ్రమూకలు బలిగొన్నాయి. ముంబై రైల్వే స్టేషన్, తాజ్ హోటల్ లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న విధ్వంసం సృష్టించారు. 

ఈ దాడుల్లో ప్రజల ప్రాణాలు రక్షిస్తూ వీర సైనికుడు సందీప్ ఉన్నికృష్ణన్ అమరుడైన సంగతి తెలిసిందే. ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు ప్రతి ఏటా ఈరోజున తాజ్ హోటల్ కు వెళ్లి తమ కుమారుడిని గుర్తు చేసుకుంటుంటారు. ఈసారి కూడా వారు తాజ్ హోటల్ కు వెళ్లారు. అక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేయగా.. ఆ సమావేశానికి హీరో అడివి శేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అడివి శేష్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాలని కొనియాడారు. 

26/11 ముంబై దాడులు, సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర నేపథ్యంలో శశి కిరణ్ తిక్క 'మేజర్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ ఈ చిత్రంలో హీరోగా సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తున్నాడు. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. 

 

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. సందీప్ ఉన్ని కృష్ణన్ కు నివాళులు అర్పించిన అనంతరం అడివి శేష్ ఆ దృశ్యాలని అభిమానులతో పంచుకున్నారు. మేజర్ చిత్రంలో మురళి శర్మ, శోభిత దూళిపాళ్ల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ రోల్స్ చేసిన అడివి శేష్ ప్రస్తుతం వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు లాంటి వరుస విజయాలతో అడివి శేష్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. 

Also Read: Nabha Natesh: పొదల చాటున అందాల లేడి పిల్ల.. హాట్ హాట్ పరువాలతో నభా నటేష్ గ్లామర్ షో

PREV
click me!

Recommended Stories

Akira Nandan: నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ రియాక్షన్‌ ఇదే
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్, ఎమోషనల్ కామెంట్స్