Mahesh babu: కొత్త బిజినెస్ పై మహేష్ నజర్... డిటైల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్!

By team teluguFirst Published Nov 26, 2021, 2:58 PM IST
Highlights

ఫ్యూచర్ టీచింగ్ ఊహించని మార్పులకు గురి కానుంది.భవిష్యత్తులో అసలు పిల్లలు స్కూల్స్ కి వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మహేష్ (Mahesh babu).. ఓ లెర్నింగ్ యాప్ సిద్ధం చేస్తున్నారట.

హీరో అంటే సినిమాలే చేయాలనే ట్రెండ్ ఎప్పుడో పోయింది. నాగార్జున, చిరంజీవి (Chiranjeevi)లాంటి సీనియర్ హీరోలు కూడా ఒక పక్కన నటిస్తూనే కొన్ని రకాల బిజినెస్ చేశారు. ఈ తరం స్టార్స్ లో మహేష్ ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. మహేష్ ఇప్పటికే పలు వ్యాపారాల్లో అడుగుపెట్టగా, ఆయనను విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఫాలో అవుతున్నారు. తాజాగా మహేష్ మరో ట్రెండీ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారని తెలిసింది. 


సాంకేతికంగా ప్రపంచం ఎంతో అడ్వాన్స్ కాగా... ప్రతి అవసరానికి ఆన్లైన్ యాప్స్ పై ఆధారపడడం పెరిగిపోయింది. ఫుడ్, షాపింగ్, మెడిసిన్ తో పాటు పలు రకాల సేవలు, వస్తువులు మనకు అందించే యాప్స్, సంస్థలు ఉన్నాయి. ఇక కరోనా పుణ్యమా అంటూ టీచింగ్ కూడా ఆన్లైన్ షేప్ తీసుకుంది. గత రెండేళ్లుగా ప్రాథమిక విద్యను ఆన్లైన్ క్లాసెస్ ద్వారా స్కూల్స్ పిల్లకు అందిస్తున్నారు. దీంతో పలు ఎడ్యుకేషన్, టీచింగ్ రిలేటెడ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటికి మంచి ఆదరణ దక్కుతుంది. 


ఫ్యూచర్ టీచింగ్ ఊహించని మార్పులకు గురి కానుంది.భవిష్యత్తులో అసలు పిల్లలు స్కూల్స్ కి వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మహేష్ (Mahesh babu).. ఓ లెర్నింగ్ యాప్ సిద్ధం చేస్తున్నారట. వర్చువల్ క్లాసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక పద్దతులతో ఆయన విద్యార్థులకు అవసరమైన యాప్ రూపొందిస్తున్నారట. ఇప్పటికే మహేష్ టీం ఈ పనిలో నిమగ్నమయ్యారట.  ఎల్ కె జి నుండి ఇంటర్మీడియల్ వరకు విద్యార్థులు ఈ యాప్ ద్వారా విద్యను అభ్యసించేలా మహేష్ ప్రణాళికలు రూపొందిస్తున్నారట. అతి త్వరలోనే మహేష్ ఈ యాప్ అందుబాటులోకి తేనున్నారు సమాచారం. 
 

Also read EMK: గురువుగారే బెటర్ అంటూ ఎన్టీఆర్ పై మహేష్ సెటైర్లు, ప్రోమో వచ్చేసింది
 కాగా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటరైన మహేష్, తర్వాత జిఎంబి ఎంటరైన్మెట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. 2019లో ది హంబుల్ కో బ్రాండ్ పేరుతో గార్మెంట్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. తన వైఫ్ నమ్రత సహకారంతో వీటన్నింటిని సక్సెస్ ఫుల్ గా  నిర్వహిస్తున్నారు మహేష్. మరోవైపు సర్కారు వారి పాట (Sarkaru vaari paata) షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సర్కారు వారి పాట సమ్మర్ కానుకగా 2022 ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఇక త్రివిక్రమ్ తో ప్రకటించిన మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో  సెట్స్ పైకి వెళ్లనుంది. 

Also read చిత్ర పరిశ్రమ మనుగడ కష్టం, అర్థం చేసుకోండి... సీఎం జగన్ కి చిరు విజ్ఞప్తి

click me!