మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మా ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల టాలీవుడ్ లో కొన్ని వివాదాస్పద సంఘటనలు జరిగాయి.
మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మా ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల టాలీవుడ్ లో కొన్ని వివాదాస్పద సంఘటనలు జరిగాయి. హేమ రేవ్ పార్టీ సంఘటన ఒకటి కాగా, జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఘటన మరొకటి. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ కాబట్టి వీటన్నింటి గురించి స్పందించాల్సి వస్తోంది.
తాజాగా మంచు విష్ణు జానీ మాస్టర్ వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్ తనని జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. కోర్టులో కూడా హాజరు పరిచారు.కొన్నేళ్ల నుంచి తనని జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని, అత్యాచారం కూడా చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివాదంలో జానీ మాస్టర్ బాగా చిక్కుల్లో కూరుకుపోయారు. జానీ మాస్టర్ ని కఠినంగా శిక్షించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా జానీ మాస్టర్ కి మద్దతు తెలుపుతున్న వారు కూడా ఉన్నారు.
ఇటీవల పోలీసులు జానీ మాస్టర్ ని విచారించారు. సదరు మహిళా కొరియోగ్రాఫర్ తనని పెళ్లి కోసం వేధించింది అని జానీ మాస్టర్ పోలీసులకు చెప్పడం విశేషం. ఆమె వేధింపులు ఎక్కువ కావడంతో ఒకసారి సుకుమార్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లా. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు అని జానీ మాస్టర్ తెలిపారు. ఆమె వెనుక ఎవరో పెద్ద వారు ఉండి ఇదంతా చేయిస్తున్నారని జానీ మాస్టర్ ఆరోపించారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని జానీ మాస్టర్ పోలీసులకు తెలిపారు.
జానీ మాస్టర్ స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు.. సదరు మహిళ ఫిర్యాదుని కూడా పరిశీలించి నిజానిజాల కోసం విచారణ చేస్తున్నారు. మంచు విష్ణు ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ఒక వేళ అది జరిగి ఉంటే మాత్రం క్షమించరాని నేరం. నిందితులని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే భారతీయ చిత్ర పరిశ్రమ అమ్మాయిలకు సేఫ్ ప్లేస్ గా ఉండాలి. కొత్త ఆడబిడ్డలు ఇక్కడకి వచ్చి సంతోషంగా పని చేసుకోవాలి. ఆ వాతావరణం కల్పించాలి. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఒక వేళ ఇది జరిగి ఉంటే మాత్రం శిక్ష పడాల్సిందే. అయితే ఈ కేసు కోర్టులో ఉన్నందు వల్ల నేను ఎక్కువ మాట్లాడలేను అని మంచు విష్ణు అన్నారు.
అదే విధంగా హేమ రేవ్ పార్టీ వ్యవహారం గురించి కూడా ప్రశ్నించారు. అయితే ఆమె గురించి మాట్లాడడానికి మంచు విష్ణు ఇష్టపడలేదు. ఆ వివాదం గురించి అడగవద్దు అని వెళ్లిపోయారు. హేమ రేవ్ పార్టీలో పాల్గొనడం, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించడం, ఆమె అరెస్ట్ కావడం లాంటి వ్యవహారాలతో మా అసోసియేషన్ కఠిన నిర్ణయం తీసుకుంది. హేమ మా సభ్యత్వాన్ని తొలగిస్తూ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే హేమ బెయిల్ పై విడుదల అయ్యాక తాను నిర్దోషిని అంటూ పలు మీడియా ఇంటర్వ్యూలలో పేర్కొంది. దీనితో మా అసోసియేషన్ ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది.
హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న తర్వాత కొన్ని రోజులకు ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు కూడా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ హేమ పేరు కూడా ప్రస్తావించారు. మొత్తం 1000కి పైగా పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. హేమ వాడిన డ్రగ్స్ గురించి కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్స్ వాడినట్లు నిర్దారణ అయిందని పేర్కొన్నారు. ఎండీపీఎస్ సెక్షన్ 27 కింద హేమపై పోలీసులు కేసు నమోదు చేశారు. హేమ మాత్రం తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.