90 వ దశకంలో వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ ఒకరు. తెలుగులో ఖుష్బూ కలియుగ పాండవులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. విక్టరీ వెంకటేష్ కి ఖుష్బూ జోడిగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఖుష్బూ నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది.
90 వ దశకంలో వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ ఒకరు. తెలుగులో ఖుష్బూ కలియుగ పాండవులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. విక్టరీ వెంకటేష్ కి ఖుష్బూ జోడిగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఖుష్బూ నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. తమిళం, హిందీ భాషల్లో కూడా ఖుష్బూ నటించింది. ప్రస్తుతం ఖుష్బూ నటిగా రాణిస్తూనే రాజకీయాల్లో సైతం క్రియాశీలకంగా ఉన్నారు. తమిళనాడు బిజెపి పార్టీలో ఆమె కీలక నేతగా ఉన్నారు.
తరచుగా ఖుష్బూ చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతుంటాయి. ఎలాంటి విషయం గురించి అయినా ఖుష్బూ ధైర్యంగా మాట్లాడుతుంటారు. హీరోయిన్లకు తరచుగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అని ఖుష్బూ. వెంకటేష్ తో నటించిన కలియుగ పాండవులు చిత్ర షూటింగ్ లో తనకి ఎదురైన చేదు సంఘటనని ఖుష్బూ వివరించింది. ఈ చిత్ర షూటింగ్ కోసం తమిళనాడులోని హొగెనక్కల్ కి వెళ్లాం. అక్కడ ఒక అబ్బాయి నన్ను అసభ్యంగా తాకాడు. గవర్నమెంట్ క్వాటర్స్ లో మాకు బస ఏర్పాటు చేశారు. అక్కడ ఒక అబ్బాయి నన్ను వెనుక నుంచి అసభ్యంగా తాకాడు.
నేను వెంటనే వెనక్కి తిరిగి చెంప పగలగొట్టా. వాడు తప్పు చేసి కూడా ఊరి మొత్తాన్ని నాపై గొడవకు తీసుకుని వచ్చాడు. ఊరి జనం మొత్తం ఓటర్ దగ్గరకి వచ్చి నిలబడ్డారు. మా ఊరు వచ్చి మా పిల్లాడిని కొట్టడం ఏంటి అని గొడవ చేస్తున్నారు. వెంకటేష్ ఊరి జనంతో మాట్లాడారు. సురేష్ బాబు కూడా ఉన్నారు. మీ ఇంట్లో ఆడపిల్లపై ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే మీరు ఊరుకుంటారా అని వెంకీ వాళ్ళని ప్రశ్నించారు. చిత్ర యూనిట్ మొత్తం నాకు సపోర్ట్ గా నిలిచింది. చివరికి వాళ్లే నాకు సారీ చెప్పి వెళ్లిపోయారని ఖుష్బూ పేర్కొంది.
అదే విధంగా పెళ్ళికి ముందే శృంగారం చేస్తే తప్పు లేదని తాను చెప్పినట్లు కొందరు వక్రీకరించారు అని ఖుష్బూ పేర్కొంది. వాస్తవానికి నేను ఎలా చెప్పలేదు. ఆ సమయంలో హెచ్ఐవి ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక వేళ ఎవరైనా పెళ్ళికి ముందే శృంగారం చేయాలి అనుకుంటే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పా. దానిని కొందరు రాజకీయ నాయకులు వక్రీకరించి.. ఖుష్బూ పెళ్ళికి ముందే శృంగారం చేస్తే తప్పు లేదు అని చెప్పినట్లు చిత్రీకరించారు అని తెలిపింది.
ఖుష్బూ ప్రస్తుతం జబర్డస్త్ లాంటి షోలలో జడ్జిగా కూడా పని చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా అందరు స్టార్లతో నటించా. బాలయ్యతో ఇంతవరకు నటించలేదు. చిరంజీవి గారితో హీరోయిన్ గా నటించలేదు. వాళ్ళిద్దరికీ హీరోయిన్ గా నటించాలనేది నా కోరిక. ఆ ఛాన్స్ కోసం వైట్ చేస్తున్నట్లు ఖుష్బూ పేర్కొంది. చిరంజీవితో ఖుష్భూ.. స్టాలిన్ చిత్రంలో అక్క పాత్రలో నటించింది. కానీ ఎలాగైనా హీరోయిన్ గా నటించాలనే కోరిక బయట పెట్టింది. ప్రస్తుతం ఉన్న యువ నటుల్లో నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. యమదొంగ లో నటించినప్పటికీ తారక్ తో మరో సినిమా చేయాలనీ ఉంది. కానీ ఈసారి చాలా కీలకమైన పాత్ర అయితేనే చేస్తాను అని ఖుష్బూ కామెంట్స్ చేసింది.
ఖుష్బూ క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మా నాన్న నన్ను అమ్మని వేధిస్తూ ఉండేవాడు. మా అమ్మ లాగా మహిళలు నిస్సహాయతతో ఉండకూడదు అని ఖుష్బూ పేర్కొంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఖుష్బూ తెలుగులో స్టాలిన్, యమదొంగ, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. మహిళల గురించి చిన్న సంఘటన జరిగినా ఖుష్బూ స్పందిస్తున్నారు. ఆ మధ్యన యానిమల్ చిత్రంలో హీరో హీరోయిన్ పట్ల ప్రవర్తించే విధానంపై ఖుష్బూ కామెంట్స్ చేశారు. అసలు యానిమల్ లాంటి చిత్రం అంత పెద్ద విజయం ఎలా సాధించిందో అర్థం కావడం లేదు. నాకు ఇప్పటికి ఆశ్చర్యంగా ఉంది. ప్రజల మనస్తత్వాలు ఈ రకంగా ఉన్నాయని తెలిస్తే షాకింగ్ గా ఉంది. ఇలాంటి మనస్తత్వాలు ఉండడం ఎప్పటికైనా సమస్యే అని ఖుష్బూ అన్నారు. ఎందుకంటే సినిమాల్లో చూపించేవే బయట కూడా జరుగుతున్నాయి.