MAA Election: బాలయ్యని కలిసిన మంచు విష్ణు.. స్టైలిష్ ఫోటోస్ వైరల్

pratap reddy   | Asianet News
Published : Oct 03, 2021, 02:24 PM IST
MAA Election: బాలయ్యని కలిసిన మంచు విష్ణు.. స్టైలిష్ ఫోటోస్ వైరల్

సారాంశం

టాలీవుడ్ లో అక్టోబర్ 10న జరగబోయే 'మా' ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. చివరగా మా ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్,మంచు విష్ణు ప్యానల్స్ మాత్రమే నిలిచాయి. 

టాలీవుడ్ లో అక్టోబర్ 10న జరగబోయే 'మా' ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. చివరగా మా ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్,మంచు విష్ణు ప్యానల్స్ మాత్రమే నిలిచాయి. దీనితో మా ఎన్నికల్లో ద్విముఖ పోటీ నెలకొని ఉంది. 'మా'కి కాబోయే అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠ నెలకొని ఉంది. 

ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మంచు విష్ణు టాలీవుడ్ లో సీనియర్ల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు లాంటి సీనియర్లు విష్ణుకి మద్దతు తెలుపుతున్నట్లు టాక్. 

ఇదిలా ఉండగా నందమూరి బాలకృష్ణ సపోర్ట్ కూడా తనకే ఉందని విష్ణు గతంలో చెప్పాడు. బాలయ్య ఫోన్ చేసి మరీ తనని ఎంకరేజ్ చేసినట్లు విష్ణు ఇటీవల ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అందుకు తగ్గట్లుగానే విష్ణు తాజాగా బాలయ్యని కలిశాడు. 

వీరిద్దరూ చాలా జోవియల్ గా ఉన్న ఫోటోస్ వైరల్ గా మారాయి. బాలయ్య స్టైలిష్ గెటప్ లో అలరిస్తున్నారు. 'మా ఎన్నికల్లో సపోర్ట్ చేస్తున్నందుకు,ఆశీస్సులు అందిస్తున్నందుకు వన్ అండ్ ఓన్లీ నటసింహం బాల అన్నయ్యకు థాంక్స్. మీరు నావెనుక ఉండి మద్దతు ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తాను' అని విష్ణు ట్వీట్ చేశాడు. 

విష్ణు ప్యానల్ లో రఘుబాబు,బాబు మోహన్, శివబాలాజీ, కరాటే కళ్యాణి, అర్చన లాంటి ప్రముఖులు ఉన్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం