సమంత చైతు మరలా అలా కలిసి..!

Published : Oct 03, 2021, 12:05 PM IST
సమంత చైతు మరలా అలా కలిసి..!

సారాంశం

బాడ్ న్యూస్ లో గుడ్ న్యూస్ అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. సమంత చైతు భార్యాభర్తలుగా విడిపోయినా, సినిమాలలో మాత్రం కలిసి నటిస్తారట.

టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరుగాంచిన చైతు, సమంత ప్రయాణం ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా పెళ్ళైన నాలుగేళ్లకు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇద్దరు పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు తెలియజేశారు. నెలరోజులుగా సమంత, చైతు బంధానికి బీటలు వారాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో, నిన్నటి ప్రకటనతో స్పష్టత వచ్చింది. 


కాగా బాడ్ న్యూస్ లో గుడ్ న్యూస్ అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. సమంత చైతు భార్యాభర్తలుగా విడిపోయినా, సినిమాలలో మాత్రం కలిసి నటిస్తారట. వీరి కాంబినేషన్ లో ఫ్యూచర్ లో సినిమాలు వచ్చే అవకాశం కచ్చితంగా ఉందని టాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆఫ్ స్క్రీన్ లో వీళ్ళద్దిరిని ఒకటిగా చూడకున్నా, ఆన్ స్క్రీన్ పై ఖచ్చితంగా చూడవచ్చని అంటున్నారు. 


ఇక ఇప్పటి వరకు సమంత, చైతు నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఏమాయ చేశావే వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం. ఈ మూవీ సమంతకు డెబ్యూ మూవీ, ఇక చైతూకు మొదటి హిట్ ఇచ్చిన సెకండ్ మూవీ. వీరి కాంబినేషన్ లో వచ్చిన మనం, మజిలీ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, టాలీవుడ్ మొత్తం షేక్
Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్