ముంబైలో డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులు డ్రగ్స్, రేవ్ పార్టీ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారు.
ముంబైలో డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులు డ్రగ్స్, రేవ్ పార్టీ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారు. దీనితో సోషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ పై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది.
అయితే ఆర్యన్ ఖాన్ ని కేవలం విచారణ కోసం మాత్రమే అదుపులోకి తీసుకున్నాం అని.. అతడిపై ఇంకా ఎలాంటి ఆరోపణలు, కేసు నమోదు కాలేదని ఎన్సీబీ అధికారులు అంటున్నారు. శనివారం రాత్రి ముంబై సముద్రం మధ్యలో ఆర్యన్ ఖాన్ మరికొందరు క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహించారు.
దీని గురించి సమాచారం అందుకున్న ఎన్సీబీ ఆకస్మిక దాడులు జరిపింది. దీనితో ఆర్యన్ ఖాన్ దొరికిపోయినట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు అనే కోణంలో ఎన్సీబీ విచారణ జరుపుతోంది. ఆర్యన్ ఖాన్ ని కూడా ఎన్సీబీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే సముద్ర తీర ప్రాంతంలో భారీగా డ్రగ్స్ ని ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంధేరిలో రూ 5 కోట్ల విలువైన ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలతో జల్సాలు చేసే యువత టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా అవుతోంది. ఆర్యన్ ఖాన్.. షారుక్, గౌరి ఖాన్ దంపతుల మొదటి కొడుకు.